సౌదీకి రక్షణగా రంగంలోకి పాకిస్తాన్, తుర్కియే..!
పశ్చిమాసియా యుద్ధం విస్తరిస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హుతీ తిరుగుబాటు దారులు.. ఒక్కోప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిని సౌదీ అరేబియా మద్దతు కల యెమన్ ప్రభుత్వం గట్టిగా ప్రతిఘటిస్తోంది. దీంతో సౌదీ టార్గెట్ గా హుతీ తిరుగుబాటు దారులు దాడులకు దిగుతున్నారు. ఈ పరిణామం గల్ఫ్ లో ప్రకంపనలు రేపుతోంది.
ఇలాంటి కీలక తరుణంలో మక్కా ఒప్పందం (Mecca Pact) యాక్టివేట్ అయింది. సౌదీకి రక్షణగా రంగంలోకి దిగేందుకు పాకిస్థాన్, తుర్కియే అంగీకరించాయి. సైనిక దళాలు, రక్షణ పరమైన టెక్నాలజీ, ఆయుధాల వంటివాటిని తరలించే ప్రక్రియను ప్రారంభించాయి.
అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్, నాటో సభ్య దేశమైన తుర్కియే, చమురు నిల్వలతో సుసంపన్నమైన సౌదీ అరేబియా (Saudi Arabia) మధ్య ఆగస్టులో కుదిరిన సంయుక్త రక్షణ ఒప్పందం కుదిరింది (Mecca pact). ఈ కూటమికి హూతీల దాడులతో తొలి పరీక్ష ఎదురైంది. ఇప్పటివరకు హూతీల దాడుల ఖండన ప్రకటనలకే పరిమితమైన పాక్, తుర్కియే తాజాగా సౌదీకి సైనిక సహాయం అందించే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఈ మేరకు సోమవారం రియాద్‌లో అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పాకిస్థాన్ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కొన్నేళ్ల అప్రకటిత కాల్పుల విమరణ తర్వాత జులై నుంచి హూతీలు, సౌదీ అరేబియా మధ్య మళ్లీ పోరు మొదలైంది. సౌదీలోని పవిత్ర నగరం మక్కా సహా పలు ప్రాంతాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, నౌకలు లక్ష్యంగా హూతీలు (Houthis) దాడులు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ ఘర్షణలు ఉద్ధృతమయ్యాయి. యెమెన్‌లో సౌదీ మద్దతు గల ప్రభుత్వం నుంచి పలు భూభాగాలను స్వాధీనం చేసుకుంటోంది. అక్కడి కీలక తుర్బా పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మోఖా రేవు పట్టణం, బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై వారు నియంత్రణ సాధించినట్లు గతనెలలోనే ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి
దీంతో సౌదీ మద్దతుతో యెమెన్ ప్రభుత్వం ‘డాన్ ఆఫ్ యెమెన్’ (Dawn of Yemen) పేరిట భారీ సైనిక చర్యను ప్రకటించింది. యెమెన్ బలగాలకు 100 యుద్ధ విమానాలు సహకారం అందిస్తున్నాయని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. ఈ సైనిక చర్య ప్రకటించిన సమయంలో మక్కా ఒప్పందం యాక్టివేట్ అయింది. దీంతో పశ్చిమాసియాలో పోరు ఎక్కడికి దారితీస్తుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెళ్తుందోననే భయాలు వ్యక్తమవుతున్నాయి.








