కాంగ్రెస్ నేత కోదండ రెడ్డిని విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి (Kodanda Reddy)ని సిట్ (SIT) అధికారులు విచారించారు. ఆయన కార్యాలయానికే వెళ్లి, దాదాపు 40 నిమిషాలపై పైగా వివిధ అంశాలపై ప్రశ్నించి, స్టేట్మెంట్ (Statement)ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping) వ్యవహారంలో ఆయన పేరు వెలుగులోకి రావడంతో ఇటీవల సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ కొన్ని నెలలు ట్యాప్ అయినట్లు గుర్తించారు.








