మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి.. ఓడిపోతే కాదా? : రామచందర్రావు
నెహ్రూ కుటుంబంలోని వ్యక్తి ప్రధాని(Prime Minister) కావడం లేదని కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ( Ramachander Rao) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుకే బీజేపీ అక్రమంగా గెలుస్తోందని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా ఎన్నికలు అక్రమంగా జరిగితే, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా చట్టవిరుద్ధంగా గెలుపొందారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలనూ రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. గతంలో కేసీఆర్ ( KCR) కుటుంబం, ఇప్పుడు రేవంత్ బ్రదర్స్ బాగుపడుతున్నారు. తప్పితే తెలంగాణ ప్రజలు మాత్రం బాగుపడడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ, ఢిల్లీకి మÖటలు పంపడానికి ఉన్నాయా? మీరు గెలిస్తే ఈవీఎంలు ( EVMs) మంచివి, ఓడిపోతే మంచివి కాదా? తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు.








