ట్రంప్ ప్రసన్నానికి చైనా ప్రయత్నాలు.. పుతిన్ ను పట్టించుకోలేదా..?
ఎపెక్ సమ్మిట్ లో జరిగిన పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాలో పర్యటించిన సందర్భంగా.. జిన్ పింగ్ దంపతులు ఘనస్వాగతం పలికారు. ఎన్నడూ లేని విధంగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి మరీ ట్రంప్ ను ఆహ్వానించారు. దశాబ్దాల ఇరుదేశాల చరిత్రలో ఓ అమెరికా అధ్యక్షుడిని.. చైనా అధినేత స్వయంగా ఆహ్వానించడం కొద్ది సందర్భాల్లోనే జరిగింది.
అయితే ఇదే సమయంలో అత్యంత సన్నిహిత మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మాత్రం కాస్త ఇబ్బందికర పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది..షెన్జెన్ పర్యటనలో అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్ (Trump)తో పోలిస్తే రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌కు చైనా (China)లో తక్కువ ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు స్వయంగా తానే వెళ్లిన జిన్‌పింగ్ (Xi Jinping).. రష్యా అధ్యక్షుడి (Vladimir Putin) కోసం మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరోలో 5వ ర్యాంక్‌లో ఉన్న కైక్విని పంపించారు. ఆయన ఎత్తు 6.1 అడుగులు కాగా.. పుతిన్ 5.7 అడుగుల వరకు ఉంటారు. పరస్పరం అభివాదం చేసుకునే సమయంలో రష్యా అధినేత అహాన్ని రెచ్చగొట్టడానికే చైనా ఇలా చేసిందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి
ఇదే సమయంలో ఎన్విడియా వ్యవహారంతో ఇబ్బందుల్లో పడిన చైనా.. దాన్ని ఇలా కవర్ చేసుకుందన్న వాదనలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ట్రంప్ కూడా ఎన్విడియా మాజీ సీఈవోకు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడిది గూఢచర్యం ఆరోపణలతో నిండి ఉండడంతో.. చిప్ ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందన్న అనుమానాలున్నాయి. ఓవేళ అమెరికా కనుక.. చిప్ లను నియంత్రిస్తే చైనాకు పలు రంగాల్లో ఇబ్బందులు తప్పవు. అందుకే ట్రంప్ ప్రసన్నానికి చైనా అధిక ప్రాధాన్యమిచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.







