ఎపెక్ సదస్సులో మనం ఎందుకు లేమన్న రాహుల్.. !
చైనాలోని షెంజెన్ లో జరిగిన ఎపెక్ సమ్మిట్ లో భారత్ పాల్గొనకపోవడాన్ని రాహుల్ ప్రస్తావించారు. అమెరికా, రష్యా, చైనాల మధ్య జరిగిన త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని (G3 Leaders Picture) రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. భారత ప్రధాన మంత్రి కూడా ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌తో సహా ఈ బల్లపై కూర్చునేవారని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అగ్రరాజ్యంతో రాజీ పడ్డారని విమర్శలు గుప్పించారు. ఇతర దేశాలకు లోబడి ఉన్నంత కాలం భారత ప్రధాని ఈ భేటీలో పాల్గొనలేరని దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి
షికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఓ పాకిస్థానీ (Pakistan) విద్యార్థి మాట్లాడుతూ ‘భారత్-పాక్ ఒక దేశంపై ఒకటి నిందలు వేసుకోకుండా.. పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పని చేయడానికి ఆస్కారం ఉందా’ అని రాహుల్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే భారత్ కోరుకుంటుంది. ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ ఇస్తున్న మద్దతే ఇరుదేశాల మధ్య చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది. పాక్ పెంచి షోషిస్తున్న ఉగ్రవాదుల వల్ల మా దేశంలోని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆ దేశంతో ఎలా చర్చలు జరుపుతాం. పాక్ ఎప్పుడైతే ఉగ్రవాద మద్దతును పూర్తిగా వదిలి వేస్తుందో అప్పుడే భారత్ తన పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తుంది’ అని రాహుల్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాకిస్థాన్‌ను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకొని.. ఆరాధిస్తుంటారని బీజేపీ విమర్శించింది. ఆ దేశానికి ఫ్యాన్ బాయ్‌గా మాట్లాడుతుంటారని ఆరోపించింది. పాక్‌పై ఉన్న ఆ ప్రేమ వల్లే ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ చేపట్టిన శాంతి ప్రయత్నాలు సహా.. దౌత్యపరమైన ప్రయత్నాలనూ విస్మరించారని దుయ్యబట్టింది. ఈ ప్రేమ వల్లే 26/11 ఉగ్రదాడి తర్వాత.. అప్పటి అధికార యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌పై దాడి చేయలేదని పేర్కొంది. బుధవారం షికాగో విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో రాహుల్ మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలలో పాకిస్థాన్ పోషించిన పాత్రను ప్రశంసించారు. భౌగోళిక రాజకీయాలపై భారత్‌కు ఉన్నతమైన అవగాహన ఉన్నప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వ నేతృత్వంలో ప్రపంచ వ్యవహారాలలో వెనుకబడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పించింది.







