5th October 2026

_________

- Bhuvana

పడుకునే ముందు ముఖానికి ఇవి రాస్తే.. ఉదయాన్నే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!

పడుకునే ముందు మేకప్, దుమ్ము, ఆయిల్ తొలగించేందుకు మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిది.

ముఖం శుభ్రం చేసుకోవడం మొదటి స్టెప్

అలోవెరా జెల్ చర్మానికి తేమను అందించి ప్రశాంతతను ఇస్తుంది. రాత్రి పలుచని పొరగా అప్లై చేస్తే చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.

అలోవెరా జెల్‌తో సహజ గ్లో

హైలురోనిక్ యాసిడ్ కలిగిన సీరమ్స్ చర్మంలో తేమను నిలిపి ఉంచడంలో సహాయపడతాయి. పొడి చర్మానికి ఇది మంచి ఎంపిక.

హైలురోనిక్ యాసిడ్ హైడ్రేషన్

రాత్రి సమయంలో ఉపయోగించే మాయిశ్చరైజర్ చర్మ బ్యారియర్‌ను కాపాడి పొడిబారకుండా చేస్తుంది. మృదువైన స్కిన్‌కు సహాయపడుతుంది.

నైట్ క్రీమ్‌తో మాయిశ్చరైజింగ్

విటమిన్ ఈ ఉన్న ఉత్పత్తులు చర్మానికి యాంటీఆక్సిడెంట్ సపోర్ట్ అందించడంలో సహాయపడతాయి. సరైన మోతాదులోనే వాడాలి.

విటమిన్ ఈ ఆయిల్ ప్రయోజనాలు

రెటినాల్ చర్మ టెక్స్చర్, ఫైన్ లైన్స్ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. మొదట తక్కువగా ఉపయోగించి చర్మ స్పందన చూడాలి.

రెటినాల్‌తో యంగ్ లుక్

తేనె, పెరుగు, ఓట్స్ వంటి పదార్థాలతో చేసే సింపుల్ ఫేస్ మాస్క్స్ చర్మానికి మృదుత్వం, ఫ్రెష్ లుక్ ఇవ్వొచ్చు.

నేచురల్ ఫేస్ మాస్క్స్