అమెరికాలో సుప్రియ మృతి చెందడం పట్ల .. మంత్రి పొంగులేటి తీవ్ర విచారం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)కు చెందిన దారం సుప్రియ (Daram Supriya) మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త గురించి తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుప్రియ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ (Bharat)కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.








