ఉప ఎన్నిక రాదు… విజయారెడ్డికి ఎందుకంత ధీమా..?
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా.. రాదా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయిత ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదంటోంది కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి. న్యాయస్థానం తన వాదనలను పరిగణలోకి తీసుకుంటుందని.. కచ్చితంగా తననే ఎమ్మెల్యేగా ప్రకటిస్తుందని నమ్మకంతో చెప్తోందామె. విజయా రెడ్డి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంటి బరిలోకి దిగారు విజయారెడ్డి. అయితే ఆ ఎన్నికల్లో విజయా రెడ్డి ఓడిపోయారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే.. అప్పట్లో దానం నాగేందర్ గెలుపును సవాల్ చేస్తూ విజయా రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దాని నామినేషన్ లో ఆస్తుల ప్రకటనలో లోపాలున్నాయని, అక్రమ మార్గాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ముగిసిన నిర్ణీత వ్యవధిలోనే ఈ పిటిషన్ దాఖలు కావడంతో, దీనిపై విచారణకు న్యాయస్థానం అంగీకరించింది.
ఇంతలో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడడం, ఈ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటన రావడంతో ఉప ఎన్నిక ఖాయమని అందరూ భావించారు. అయితే గతంలో తాను వేసిన పిటిషన్ కోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉందని.. దానిపై తుది తీర్పు రాకుండా ఉప ఎన్నిక నిర్వహించడం తగదని విజయా రెడ్డి వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా విజయారెడ్డి వాదనలతో ఏకీభవించింది. కోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగులో ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయలేమని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ఉప ఎన్నిక ఖాయమనుకున్న సమయంలో తలెత్తిన ఈ ట్విస్టులు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. దానం అక్రమాలపైన తాను న్యాయస్థానంలో అన్ని ఆధారాలు సమర్పించానని, కచ్చితంగా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని విజయా రెడ్డి ధీమాగా ఉన్నారు. దానం అనర్హుడని తేలితే, తననే ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటిస్తుందని చెప్తున్నారు. అప్పుడు ఉప ఎన్నిక అవకాశమే లేదనేది ఆమె వాదన. ఒకవేళ కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రాకపోతే, ప్రత్యామ్నాయాలపైన కూడా విజయా రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.








