Iran: తన హిట్ లిస్టు రిలీజ్ చేసిన ఇరాన్, ఇక నాశనమే..!
మధ్యప్రాచ్యంలో(Middle East) ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌లోని కరాజ్ నగరంలో ఉన్న కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్(America-Israel) సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతీకారంగా పొరుగు దేశాల్లోని ఎనిమిది ప్రధాన వంతెనల జాబితాను ఇరాన్ విడుదల చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని ఉత్తర నగరమైన కరాజ్‌లో ఉన్న వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై ఇటీవల దాడులు జరిగాయి.
ముఖ్యంగా ఇరాన్‌లోనే అత్యంత ఎత్తైనదిగా పేరుగాంచిన ‘B1 వంతెన’పై గురువారం రెండుసార్లు వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక అమెరికా-ఇజ్రాయెల్ హస్తం ఉందని భావిస్తున్న ఇరాన్, దీనిని ఒక తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తోంది. ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ తమ హిట్ లిస్టు రిలీజ్ చేసింది. ఆ కథనం ప్రకారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యంగా చేసుకోబోయే ప్రాంతాలు ఒకసారి చూస్తే.. గల్ఫ్ దేశాలు అలాగే జోర్డాన్ లోని.. ఎనిమిది అత్యంత కీలకమైన వంతెనలను ఇరాన్ తన లక్ష్యాలుగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
ప్రపంచంలోని అతి పొడవైన సముద్ర వంతెనలలో ఒకటిగా, కువైట్ ఉత్తర ప్రాంతానికి కీలకమైన రవాణా మార్గంగా ఉన్న.. షేక్ జాబెర్ అల్-అహ్మద్ అల్-సబా సీ బ్రిడ్జ్, సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే కింగ్ ఫహద్ కాజ్వే, అబుదాబి ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ముఖ్యమైన వంతెనగా ఉన్న షేక్ జాయెద్ బ్రిడ్జ్, అబుదాబిలో రవాణాకు కీలకమైన పురాతన మరియు వ్యూహాత్మక వంతెనగా ఉన్న.. అల్ మఖ్తా బ్రిడ్జ్, జోర్డాన్ మరియు వెస్ట్ బ్యాంక్ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న.. కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ (అలెన్బీ బ్రిడ్జ్) లను ఇరాన్ టార్గెట్ చేసింది.
తమ దేశంలోని మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తే, ప్రతిచర్య అంతకంటే తీవ్రంగా ఉంటుందని ఇరాన్ ఈ వార్నింగ్ తో క్లారిటీ ఇచ్చింది. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్ ఈ వంతెనలపై దాడులు చేస్తే, అది కేవలం రవాణాకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి, చమురు సరఫరాకు పెద్ద విఘాతం కలిగించవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా, తాజా ‘హిట్ లిస్ట్’ నేరుగా ఇతర అరబ్ దేశాలను కూడా ఈ యుద్ధంలోకి లాగే ప్రమాదం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








