Drone: భయపెడుతున్న ఇరాన్ అండర్ వాటర్ డ్రోన్ లు..!
రోజు రోజుకి యుద్ధం తీవ్రమవుతోన్న నేపధ్యంలో ఇరాన్ సైన్యం ఇటీవలి కాలంలో, సముద్ర గర్భంలో రహస్యంగా పనిచేసే అధునాతన అండర్ వాటర్ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ నావికాదళం, రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇరాన్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన అండర్ వాటర్ డ్రోన్లలో(Under Water Drone) అజ్దార్ ఒకటి. దీనిని 2026 మార్చి నాటికి ఇరాన్ తన అమ్ములపొదిలో కీలక ఆయుధంగా వాడుతోంది. ఇది సుమారు 8 మీటర్ల పొడవు ఉండగా.. జలాంతర్గాముల నుండే ప్రయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి

లిథియం-అయాన్ బ్యాటరీలతో పని చేసే ఈ డ్రోన్ చాలా తక్కువ సౌండ్ చేస్తుంది. శత్రువుల సోనార్ల కంటికి చిక్కకుండా ప్రయాణం చేస్తుంది. సుమారు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. దీనిని సముద్రం అడుగున 24 గంటల పాటు మాటువేసి ఉండేలా తయారు చేసారు. యుద్ధ నౌకలను లేదా వాణిజ్య నౌకలను రహస్యంగా సమీపించి పేల్చివేయడానికి దీనిని ఇరాన్ వాడుతోంది. ఖైబర్ లేదా మైన్-క్లియరింగ్ డ్రోన్లను కూడా ఇరాన్ వాడుతోంది. ఇరాన్(Iran) నావికాదళం సముద్రంలో మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రత్యేకమైన డ్రోన్లను రూపొందించింది.
ఇవి నీటిలో 200 మీటర్ల లోతు వరకు వెళ్లగలవు. ఒకసారి ప్రయోగిస్తే 24 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తాయి. సూసైడ్ డ్రోన్ లను అండర్ వాటర్ లో కూడా ఇరాన్ వాడుతోంది. గాలిలో పేలిపోయే షాహెద్ డ్రోన్ల తరహాలోనే, నీటి అడుగున కూడా వెళ్లే ‘కామికేజ్’ డ్రోన్లను ఇరాన్ అభివృద్ధి చేస్తోంది. ఇవి ఒకసారి టార్గెట్ను గుర్తిస్తే, నేరుగా వెళ్లి ఆ నౌకను ఢీకొట్టి పేలిపోతాయి. కొన్ని డ్రోన్లు కేవలం నిఘా కోసం వాడుతోంది ఇరాన్. ఇవి అమెరికా వంటి దేశాల యుద్ధ నౌకల కదలికలను రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి ఇరాన్ బలగాలకు అందిస్తాయి.
ఇవి కూడా చదవండి








