Donald Trump: ఇరాన్ సుప్రీం లీడర్ పై ట్రంప్ సంచలన కామెంట్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) బ్రతికి ఉన్నాడా లేదా అనే దానిపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు అతను చనిపోయాడు అంటూ హడావుడి చేసిన అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా అతను బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను అంటూ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. మొజ్తబా ఖమేనీ మరణించాడనే వార్తలను తోసిపుచ్చుతూ, ఆయన ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని ట్రంప్ కామెంట్ చేయడం చర్చనీయాంశం అయింది.
ఇవి కూడా చదవండి
మొజ్తబా బ్రతికే ఉన్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్(Israel) దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త లీడర్‌గా మొజ్తబా ఎన్నిక కావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఆయన ప్రశాంతంగా బ్రతకలేడు అంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం టెహ్రాన్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఒక కాలు కోల్పోవడంతో పాటు కోమాలో ఉన్నారనే వార్తలు ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ఇరాన్ అధికారిక వర్గాలు మాత్రం ఆయన స్వల్పంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన సుప్రీం లీడర్ గా విధులను నిర్వహిస్తున్నారని చెబుతున్నాయి. తాజాగా ఖమేని అమెరికాను హెచ్చరిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేసారు. ఇరాన్ ఎక్కడా తల వంచే ప్రసక్తే లేదని హెచ్చరించడమే కాకుండా, హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నామని స్పష్టం చేసారు. మొత్తానికి, ఇరాన్ కొత్త నాయకత్వంపై ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అమెరికా ప్రమేయం లేకుండా జరిగే ఏ ఎన్నికనైనా తాము ఆమోదించబోమని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








