Iran Missile Attack: అబ్రహం లింకన్ నౌకను కూల్చేశామన్న ఇరాన్.. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆగదన్న అమెరికా
Iran Missile Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాకు చెందిన భారీ విమాన వాహకనౌక ‘అబ్రహం లింకన్’పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. తమ క్షిపణులు లక్ష్యాన్ని విజయవంతంగా ఢీకొట్టాయని, దీంతో నౌక దెబ్బతిని పనిచేయని స్థితిలో గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని వెల్లడించింది.
అయితే, ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా తీవ్రంగా తోసిపుచ్చింది. ఇరాన్‌పై అమెరికా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ఈ యుద్ధనౌక నిరంతరాయంగా మద్దతు ఇస్తూనే ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ (X) వేదికగా స్పష్టం చేసింది. ఇరాన్ వాదనలో వాస్తవం లేదని ఖండించింది.
ఇవి కూడా చదవండి

మరోవైపు అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అబ్రహం లింకన్ నౌకకు అత్యంత సమీపంలోకి ఒక ఇరాన్ పడవ వచ్చినట్లు, వెంటనే అప్రమత్తమైన అమెరికా దళాలు దానిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో అమెరికా నౌకకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే అంశంపై స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎనిమిది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను మోసుకెళ్లగల ఈ శక్తివంతమైన నౌకను, ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించింది.
ఇవి కూడా చదవండి








