విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. ఛార్జీల్లో 25% కోత!
పశ్చిమాసియాలో అమెరికా – ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విమానాల నిర్వహణ భారాన్ని తగ్గించే దిశగా అత్యవసర ఉపశమన చర్యలు చేపట్టింది.
తక్షణమే అమల్లోకి..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను రాబోయే మూడు నెలల పాటు 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ సవరించిన (తగ్గించిన) ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ భారత విమానాశ్రయాలకు (Airlines) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
సంస్థల విజ్ఞప్తికి సానుకూల స్పందన
అదనపు భారం: ఇరాన్ ఉద్రిక్తతలకు తోడు, పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా దేశీయ విమానాలు (Airlines) చాలా కాలంగా లాంగ్ రూట్లో (సుదూర మార్గంలో) ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఆయా సంస్థలకు ఇంధన, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
నష్టాల్లో దిగ్గజాలు: ఈ విపత్కర పరిస్థితుల వల్ల దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్స్ (Airlines) అయిన ఇండిగో, ఎయిరిండియాలకు అత్యధిక నష్టం వాటిల్లుతోంది. దీంతో ఎయిర్పోర్టులు విధించే అదనపు ఛార్జీల నుంచి కొంతైనా ఉపశమనం కల్పించాలని ఆ రెండు సంస్థలు ఇటీవల ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి.
వీటి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. కష్టకాలంలో ఏవియేషన్ రంగాన్ని ఆదుకునేందుకు సకాలంలో ఈ ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి







