రాజకీయ యవనికను మార్చడానికే ఈ బిల్లు తెచ్చారు : రాహుల్ గాంధీ
భారత రాజకీయ యవనికను మార్చడానికే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజ్వేషన్ బిల్లు తీసుకొచ్చిందని, ఇది దేశ వ్యతిరేకమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందడాన్ని తాము అనుమతించమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చ సందర్భంగా శుక్రవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ అధికారం దూరమవుతోందన్న భయంలో ఎన్డీయే వుందని, వారి దృష్టిలో రాజ్యాంగాని కంటే మనువాదానికే అధిక ప్రాధాన్యం వుంటుందని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సత్యం అంటే అస్సలు గిట్టదని, వాస్తవానికి ఈ బిల్లతును ఆమోదింపజేసుకోవడం తమ వల్ల కాదన్న విషయం బీజేపీకి బాగా తెలుసని, ఈ బిల్లు ద్వారా దేశ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
తాను మహిళా పక్షపాతినని చూపించుకోవడానికే ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఇదంతా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. మొదటి నిజం ఇది మహిళా బిల్లు కాదని, దీనికీ మహిళా సాధికారతతో అసలు సంబంధమే లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కుల గణనను పక్కదారి పట్టించే ఒక ప్రయత్నమని, అలాగే ప్రభుత్వం OBC వర్గాల నుండి అధికారాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అంతగా కావాలంటే పాత బిల్లును రద్దు చేసి, మళ్లీ తీసుకురావాలని, తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మద్దతిస్తామని ప్రకటించారు. బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల ఈ బిల్లు క్షమించరాని క్రూరమైన చర్య అని మండిపడ్డారు. కులగణన ప్రారంభమైందని హోంమంత్రి అమిత్ షా చెప్పారని, ఇప్పుడు కులగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ ఎందుకు జరుగుతోందని? విపక్షాలన్నీ దీన్ని ఓడిస్తాయని ప్రకటించారు.
తామే దేశ ప్రజలకు, భారత సైన్యానికి ప్రతినిధులం అన్న భ్రమలో బీజేపీ వుందని దెప్పిపొడిచారు. కానీ.. వారేమీ భారత సైన్యం కాదని, తాము బీజేపీపైనే దాడి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా కుల గణనను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరుగుతోందని, వారికి అధికారాన్ని, ప్రాతినిధ్యాన్ని కల్పించకుండా తప్పించుకోవడానికి , అలాగే వారి నుంచి అధికారాన్ని లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. న్యాయవ్యవస్థ, ప్రైవేటు రంగం వంటి కీలక రంగాల్లో ఓబీసీలు, దళితులు ఎక్కడున్నారు? దేశ అత్యున్నత బ్రూరోక్రసీలో వీరు ఎక్కడున్నారు? వారికి అధికారం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని విమర్శించారు.
ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మహిళలు ఓ కేంద్రంగా, చోదక శక్తిగా ఆవిర్భవించారన్నారు. సభలోని సభ్యులందరూ మహిళల నుంచి ఎంతో నేర్చుకున్నారన్నారు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మహిళలు తల్లులుగా, సోదరీమణులుగా వున్నారన్నారు. ఈ చట్టానికి మహిళా సాధికారతతో ఎటువంటి సంబంధం లేదని ప్రతిపక్ష నాయకుడు పేర్కొన్నారు; 2023లో ఈ సభలో ఆమోదించబడిన బిల్లే అసలైన మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి








