ఇంత ఆలస్యంగా రంగంలోకా? బెంగాల్ ను రాహుల్ లైట్ తీసుకున్నారా?
ఎట్టకేలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బెంగాల్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రావడం రావడమే సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగారు. బెంగాల్ కేంద్రంగా మళ్లీ ఓట్ చోరీ’’ అని తెరపైకి తెచ్చారు. బెంగాల్ లోని రాయ్ గంజ్ లో తన మొదటి ఎన్నికల ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆరెస్సెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు.
బీజేపీ, ఆరెస్సెస్ కలిసి విద్వేష పూరిత భావజాలంతో రాజ్యాంగాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. వారు ఈ పనిని బహిరంగంగా చేయలేరు కాబట్టి, సంస్థల ముసుగులో రాజ్యాంగంపై దాడి చేస్తున్నారన్నారు. సాధ్యమైన చోట్లలో తమ సంస్థలలోని వ్యక్తులను నియమించి, ఓట్లను దొంగలిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని హతం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు.
అలాగే చాలా రోజుల క్రితం చేసిన భారత్ జోడో యాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ ద్వేషపూరిత భావజాలానికి వ్యతిరేకంగానే పోరాటమని వివరించారు. అందుకే ప్రేమ, ఐకమత్యం అన్న సందేశాన్ని చాటి చెప్పేందుకు తాను 4,000 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర చేపట్టానని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇక.. టీఎంసీ, వామపక్షాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పూర్తిగా నాశనమైపోయిందని రాహుల్ విమర్శించారు. గతంలో బెంగాల్ ఓ పారిశ్రామిక కేంద్రంగా వుండేదని, మొదట కమ్యూనిస్టులు, ఇప్పుడు మమతా బెనర్జీతో పారిశ్రామిక రంగం పూర్తిగా ధ్వంసమైందన్నారు. మమతా హయాంలోనే శారదా చిట్ ఫండ్ అవినీతి జరిగిందని, 17 లక్షల మంది పెట్టుబడిదారులకు చెందిన రూ. 1,900 కోట్లు ఇంకా తిరిగి చెల్లించలేదని మండిపడ్డారు.,
ఇంత ఆలస్యంగా బెంగాల్ లో ప్రచారమా?
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ లాగే నడుస్తోంది. అటు వామపక్షాలు లేవు. ఇటు కాంగ్రెస్సూ లేదు. మమతా, బీజేపీయే హోరాహోరీగా తలపడుతున్నారు. పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ఇంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అంతో ఇంతో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ కాస్త పోరాడుతున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం అంత సీరియస్ తీసుకుంటున్నట్లు కనిపించడమే లేదు. చివరికి కాంగ్రెస్ కేడర్ లో ఆత్మ విశ్వాసం కోసం రాహుల్ పర్యటించినట్లు తెలుస్తోంది.
రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్ గా విమర్శలకు దిగారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ప్రయత్నమైతే చేస్తున్నారు. రాయ్గంజ్లో జరిగిన తన బహిరంగ సభలో ఎంజీఎన్ఆర్ఈజీఏ, కేంద్ర బడ్జెట్లో బెంగాల్‌కు ప్రాజెక్టులను దక్కకుండా చేయడం, సర్ ప్రక్రియ గురించి మాట్లాడారు. అలాగే శారదా చిట్ ఫండ్ అవినీతిని కూడా ప్రస్తావించారు.
పశ్చిమ బెంగాల్‌లోని కీలక అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ అక్కడికి రావడం, కాంగ్రెస్ పార్టీ తన మాల్తీపూర్ (మాల్దా జిల్లా) అభ్యర్థి మౌసమ్ నూర్ మరియు బెహ్రంపూర్ (ముర్షిదాబాద్ జిల్లా) అభ్యర్థి అధీర్ రంజన్ చౌదరిల వ్యక్తిగత ప్రతిష్ట మరియు ప్రజాదరణపైనే ఆధారపడి, కనీసం కొన్నింటిలోనైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి








