బెంగాల్ లో పోలింగ్ హింసాత్మకం.. ముర్షీదాబాద్, సిలిగురి ప్రాంతాల్లో గొడవలు
బెంగాల్, తమిళనాడులో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే బెంగాల్ లో మాత్రం మొదటి దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఓవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తుండగా, మరో వైపు భౌతికదాడులు, అగ్నిప్రమాదాలు, ఎన్నికలకు సంబంధించిన అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్, కూచ్, బెహార్, సిలిగురి, మాల్దాలలో హింసాత్మక వాతావరణం నెలకొంది. ముర్షీదాబాద్ లో దుండగులుAJUP అధినేత, రెజినగర్ అభ్యర్థి అయిన హుమాయున్ కబీర్ కారుపై కర్రలతో, ఇటుకలతో దాడికి దిగారు. అంతేకాకుండా ఆయన కాన్వాయ్ పై కూడా దాడి జరిగింది. దీంతో అధికార టీఎంసీ కార్యకర్తల మధ్య, AJUP కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసు అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు కూచ్ బెహార్ లోని తుఫాన్ గంజ్ ప్రాంతంలో కూడా పోలింగ్ సమయంలో ఓటర్లు భారీగా గుమిగూడారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదుపు తప్పే ప్రమాదం వుందని గ్రహించిన అధికారులు, అక్కడ కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్వల్పంగా లాఠీఛార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు దక్షిణదినాజ్పూర్లోని కుమార్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తీవ్ర ఆందోళన కలిగించే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ అభ్యర్థి సుభేందు సర్కార్ పై టీఎంసీ మద్దతు దారులు దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ పోలింగ్ బూత్ వద్ద బూత్ జామింగ్ జరుగుతోందని ఆరోపణలు రావడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. దీంతో కర్రలతో టీఎంసీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. పిడిగుద్దులు కూడా గుద్దారు. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.టీఎంసీ తనను గూండాలతో కొట్టించిందని సుభేందు ఆరోపిస్తున్నారు.
మాల్దాలోని మోథాబారి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వున్న బూలుచారా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయలేదు. దీంతో స్థానికులకు ఆగ్రహం వచ్చింది. ఎన్నికల అధికారులు కూడా కనిపించకపోవడంతో ఓటర్లు ఆగ్రహానికి గురయ్యారు. అధికారిపై భౌతిక దాడి చేసినంత పని చేశారు. దురుసుగా కూడా ప్రవర్తించారు.మాల్దా జిల్లాలోని హరీష్చంద్రపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అదే పార్టీకి చెందిన తాజ్ ముల్ హెస్సేన్ ప్రచార కార్యాలయాన్ని ధ్వంసం చేసేశారు.
హరీష్చంద్రపూర్-I బ్లాక్ పంచాయతీ సమితికి చెందిన TMC నాయకుడు స్వపన్ అలీ, మంత్రి తాజ్ముల్ హుస్సేన్ మరియు ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని టీఎంసీ కార్యకర్తలే ఆరోపించారు.
ఇక.. సిలిగురిలో కూడా టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఆకస్మికంగా హింస చెలరేగింది. దీంతో ఇది ముదిరి ఇరు వర్గాలు తోపులాటల వరకూ వెళ్లాయి. ఈ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శంకర్ ఘోష్ కూడా సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) సిబ్బంది, గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టారు.దీంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి






