తమిళనాడులో 37.56 శాతం, బెంగాల్ లో 41.11 శాతం…
తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సాధారణ ప్రజలు, సెలెబ్రెటీలు తరలివస్తున్నారు. బెంగాల్ లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా.. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకూ తమిళనాడులో 37.56 శాతం పోలింగ్ నమోదు కాగా, బెంగాల్ లో 41.11 శాతం ఓటింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి
తమిళనాడులో…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటేశారు. శివగంగ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నటుడు విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో…
కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హసన్ చెన్నైలో..
ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా తన కుటుంబంతో కలిసి చెన్నైలో…
చెన్నైలోని తిరువన్మియుర్ లో ప్రముఖ నటుడు అజిత్ ఓటేశారు.
ఇక.. బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘‘మార్పు ఖాయం’’ అని అన్నారు. మరో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ కూడా ఓటేశారు.మరోవైపు బెంగాల్ లో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముర్షీదాబాద్, కూచ్ బిహార్, సిలిగురి, మాల్తా ప్రాంతాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. అదుపు చేసేందుకు కేంద్ర బలగాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి






