ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాన్ని మార్చేస్తున్న సీఎం స్టాలిన్…
ఈసారి బీజేపీ బెంగాల్ తో పాటు తమిళనాడుపై కూడా కన్నేసింది. అయితే.. బెంగాల్ లో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తుంటే.. తమిళనాడులో మాత్రం సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఆత్రుతతో పనిచేస్తోంది. మరోవైపు సీఎం స్టాలిన్ ఈాసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న తపనతో కష్టపడుతున్నారు. ఈ దిశగానే ప్రచారం చేస్తున్నారు. అయితే.. ప్రచారంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూనే వస్తున్నారు. దీంతో ప్రజల సరళిని ఎప్పటికప్పుడు తనవైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు స్టాలిన్.
ఎన్నికలే జరగలేదు అప్పుడే మళ్లీ సీఎంగా స్టాలిన్ గెలుస్తున్నారంటే డీఎంకే విపరీతమైన ప్రచారాన్ని ప్రారంభించించేది. అంతేకాకుండా ప్రచారం తుది దశకు వచ్చేసరికి తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని కూడా స్టాలిన్ మార్చిపారేశారు. ఇలా ఎన్నికల ప్రచార పద్ధతిని మార్చుకోవడం ఇది రెండోసారి. ప్రారంభంలో డీఎంకే తన ప్రచారాన్ని జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయవాదం, భాష, అభివృద్ధి, ద్రావిడ వాదం చుట్టూ తిప్పేశారు.
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించే వైపు ప్రచారం మళ్లింది. తాజాగా ఇక ప్రచారం ముగుస్తుంది అన్న దశలో మళ్లీ ఇప్పుడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో, ఈ ప్రచారం ఒక కొత్త దిశను సంతరించుకుంది.
తాజాగా డీఎంకే తన ఎన్నికల ప్రచారంలో ‘‘ద్రావిడ ఆత్మ గౌరవం’’ వైపు మళ్లించింది. ఇంటింటికీ వెళ్తూ డీలిమిటేషన్ వీగిపోయిందని, ఇది డీఎంకే విజయమేనని చెప్పుకుంటోంది. తమిళనాడుకు వచ్చే ముప్పును రక్షించేది కేవలం స్టాలిన్ మాత్రమేనని డీఎంకే కేడర్ ప్రజలకు పదే పదే చెబుతోంది.లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎం.కె. స్టాలిన్, “మన తలలపై వేలాడుతున్న కత్తి ఇప్పుడు మనపైనే పడింది,” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా డీలిమిటేషన్ బిల్లు సభలో వీగిపోయినప్పుడు ఎక్స్ మాధ్యమంగా కూడా స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తమిళనాడు ఢిల్లీని ఓడించింది. ఢిల్లీ అహంకారాన్ని, దానికి మద్దతిచ్చేవారిని కూడా ఇలాగే ఓడిస్తాం’’ అంటూ రాసుకొచ్చారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్టాలిన్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల హక్కులను పరిరక్షించేందుకు, అలాగే హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ఆరోపణలకు వ్యతిరేకంగా ఆ పార్టీ అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిందని, వినకపోతే 1950,60 నాటి డీఎంకేను చూస్తారంటూ హూంకరించారు. దీనికి సమాంతరంగా, DMK కార్యకర్తలు ‘తమిళ ఆత్మగౌరవం’ కోసం ఒక పోరాటాన్ని ప్రారంభించారు. BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాలిన్ ఇచ్చిన సందేశం DMK కార్యకర్తలలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
దీనినే చివరి అస్త్రంగా వాడుకుంటోంది డీఎంకే. ‘‘ద్రావిడ ఆత్మ గౌరవ కార్యక్రమం’’ గా డీఎంకే కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీని ద్వారా తమిళ ఆత్మ గౌరవం, అస్తిత్వం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారు సీఎం స్టాలిన్.
ఎన్నికల సమయంలో బీజేపీ గుజరాతీ ఆత్మ గౌరవాన్ని ఎలా అయితే ప్రచారం చేస్తుందో.. అచ్చు డీఎంకే కూడా తమిళ ఆత్మ గౌరవాన్ని తెరపైకి తెచ్చి, బీజేపీకి చెక్ పెడుతోంది. తమిళనాడుకి, ఢిల్లీకి మధ్య జరుగుతున్న ‘‘తమిళ ఆత్మ గౌరవానికి లభించిన చిహ్నంగా చెప్పుకుంటున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు సభలోకి వచ్చే సమయంలో స్టాలిన్ నల్లటి వస్త్రాలు ధరించి, నల్ల జెండా ఊపుతూ బిల్లు ప్రతులను దహనం చేశారు. దీని ద్వారా స్టాలిన్ విజయమే అని చాటి చెప్పేందుకు డీఎంకే ప్రయత్నం చేసింది.
ఇవి కూడా చదవండి








