భారతదేశపు టాప్ 50 గ్రేట్ పీపుల్ మేనేజర్స్TM 2026 జాబితాలో కేవీబీ రెడ్డికి చోటు
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ మరియు సీఈవో శ్రీ కేవీబీ రెడ్డి ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2026కి గాను గ్రేట్ మేనేజర్ ఇన్స్టిట్యూట్TM రూపొందించిన భారతదేశపు టాప్ 50 గ్రేట్ పీపుల్ మేనేజర్స్TM లో చోటు దక్కించుకున్నారు. అత్యుత్తమ నాయకత్వానికి ప్రమాణంగా ఇది పరిగణించబడుతుంది.
విశ్వసనీయమైన పరిస్థితులను కల్పించడం, ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, నిర్దిష్ట లక్ష్యంతో పని చేసేలా సంస్థలను తీర్చిదిద్దడంలో ముందుండే నాయకులను ఈ గుర్తింపు సముచితంగా గౌరవిస్తుంది. భారతదేశపు టాప్ 50లో చోటు దక్కించుకోవడమనేది, సంస్థ విజయానికి సిబ్బంది, సంస్కృతి, భాగస్వామ్యాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి కేవీబీ రెడ్డి సారథ్య సూత్రాలకు గల ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తుంది.
ఆయన సారథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఆధునిక, కస్టమర్ కేంద్రీకృత పట్టణ ప్రాంత మొబిలిటీకి ఒక నమూనాగా నిల్చింది. సేవలు, భద్రత, నవకల్పనల్లో నిరంతరం అత్యుత్తమ పనితీరు కనపరుస్తూ పురోగమిస్తోంది. తన నాయకత్వంతో ఆయన పారదర్శకత, సాధికార, సమిష్టి జవాబూదారీతనపు పని సంస్కృతిని పెంపొందించారు. ఇవే విలువలు దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా మెట్రోకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
“భారతదేశపు టాప్ 50 గ్రేట్ పీపుల్ మేనేజర్స్లో ఒకరిగా గుర్తింపు పొందడం ఎంతో గౌరవప్రదమైన విషయం. హైదరాబాద్ మెట్రో రైల్ కుటుంబం యొక్క అంకితభావం, నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలను గౌరవిస్తూ, మద్దతునిస్తూ, వారిపై నమ్మకం ఉంచినప్పుడు వారు అసాధారణమైన విజయాలు సాధించగలని నేను సర్వదా విశ్వసిస్తాను. వ్యక్తులు పురోగమిస్తూ, అలాగే బృందాలన్నీ సమష్టిగా ముందుకెళ్లే సంస్కృతిని పెంపొందిచడాన్ని కొనసాగించాలన్న మా సంకల్పానికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలుస్తుంది,” అని శ్రీ కేవీబీ రెడ్డి తెలిపారు.








