ఉదయం అలారం మోగగానే స్నూజ్ నొక్కి మళ్లీ పడుకుంటున్నారా? ఈ బద్ధకం మనందరి కథే. దీనికి చెక్ పెట్టే చిట్కా ఇక్కడ ఉంది!
ఉత్పాదకత నిపుణుడు జేమ్స్ క్లియర్ చెప్పిన రూల్ ఇది. ఏదైనా కొత్త అలవాటును కేవలం రెండు నిమిషాల చిన్న పనిగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం
ఏదైనా పనిని ప్రారంభించడానికి 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు." ఆరంభం సులువైతే, ఆ తర్వాత పని చేయడం చాలా సులభం అవుతుంది.
'రేపటి నుండి ఉదయం 5 గంటలకే లేచి గంటసేపు వ్యాయామం చేయాలి' అని పెద్ద లక్ష్యాలు పెట్టుకోకండి. అది మీ మెదడుకు భారంగా అనిపిస్తుంది.
మీ పెద్ద లక్ష్యాన్ని కుదించండి. "ఉదయం లేచి కేవలం 2 నిమిషాలు నా రన్నింగ్ షూస్ వేసుకుంటాను" అని మాత్రమే మైండ్ ఫిక్స్ అవ్వండి.
షూస్ వేసుకోవడానికి 2 నిమిషాలు చాలు. ఒకసారి షూస్ వేసుకున్నాక, మళ్లీ పడుకోవాలనిపించదు. సహజంగానే వాకింగ్‌కు బయలుదేరుతారు.
రాత్రి పడుకునే ముందు 'ఒక చాప్టర్ చదవాలి' అనకుండా, 'కేవలం ఒక్క పేజీ చదువుతాను' అనుకోండి. 2 నిమిషాల్లో ఆ పని పూర్తవుతుంది.
నిశ్చలంగా ఉన్న వస్తువు నిశ్చలంగానే ఉంటుంది. కదలికలో ఉన్నది కదులుతూనే ఉంటుంది. మనుషులకూ ఇది వర్తిస్తుంది. ఆరంభమే ముఖ్యం!
రోజుకు 2 నిమిషాలే చేసినా, మీరు రోజూ ఆ పని చేస్తున్నారనే నమ్మకం మెదడులో బలపడుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
రేపటి నుండి కాదు, ఇప్పుడే ఈ 2 మినిట్ రూల్ పాటించండి. బద్ధకాన్ని జయించి, మీ జీవితాన్ని సూపర్ యాక్టివ్‌గా మార్చుకోండి!