ఆకలి వేస్తోందా? అప్పటికప్పుడు క్రంచీ టిఫిన్! పిండి నానబెట్టే ఓపిక లేదా? హోటల్ స్టైల్ కరకరలాడే రవ్వ దోశను కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు బియ్యప్పిండి, పావు కప్పు మైదా, పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి మరియు తరిగిన ఉల్లిపాయలు.
ఒక గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి, మైదా, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి.
తగినన్ని నీళ్లు లేదా పల్చటి మజ్జిగ పోసి పిండిని అస్సలు ఉండలు లేకుండా, పల్చగా (మజ్జిగలా) జారుడుగా కలుపుకోవాలి.
కలిపిన మిశ్రమాన్ని 10 నిమిషాలు నాననివ్వాలి. దీనివల్ల రవ్వ నీటిని పీల్చుకుని, దోశలు పర్ఫెక్ట్ జాలీలుగా వస్తాయి.
పెనంపై ముందుగా ఉల్లిపాయ ముక్కలు చల్లి, పల్చటి పిండిని అంచులనుండి మధ్యలోకి పల్చటి పొరలా (జాలీలా) పోయాలి, రుద్దకూడదు.
పెనంపై ముందుగా ఉల్లిపాయ ముక్కలు చల్లి, పల్చటి పిండిని అంచులనుండి మధ్యలోకి పల్చటి పొరలా (జాలీలా) పోయాలి, రుద్దకూడదు.
శ పైన, అంచుల చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఓపిగ్గా కాల్చాలి.
రవ్వ దోశను రెండో వైపు తిప్పాల్సిన పనిలేదు. అంచులు పైకి లేస్తూ ఎర్రగా అవ్వగానే మెల్లగా రోల్ చేసి ప్లేట్ లోకి తీసుకోండి.
ఇంతే! ఎంతో రుచికరమైన ఇన్ స్టంట్ హోటల్ స్టైల్ రవ్వ దోశ రెడీ. దీన్ని పల్లీల చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే అద్భుతం!