సిక్కింలో ప్రధాని మోదీ ఫుట్ బాల్ ఆట.. బెంగాల్ కి మోదీ ఏం సంకేతాలు పంపారో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులతో కలిసి సిక్కింలో ఫుట్ బాల్ ఆడారు. సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సిక్కింలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అక్కడి క్రీడాకరులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్యాంగ్ టక్ లో యువ మిత్రులతో కలిసి ఆడటం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని, చాలా ఆనందంగా వుందని చెప్పుకొచ్చారు.
అయితే.. ముఖ్యంగా సిక్కిం పొరుగునే వున్న బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ ఫుట్ బాల్ ఆడటం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి బెంగాల్ కి ,ఫుట్ బాల్ కి చాలా దగ్గర సంబంధం వుంది. బెంగాల్ కి, ఫుట్ బాల్ కి సాంస్కృతికంగా, భావోద్వేగ పరంగా చాలా ప్రాముఖ్యత వుంది. బెంగాల్ రాజకీయాల్లో, ఫుట్బాల్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, అది తరచుగా ప్రజలను ఆకట్టుకునే ఒక భాషగా కూడా పనిచేసింది.అయితే సిక్కిం కేంద్రంగా బెంగాల్ ప్రజలకు రాజకీయంగా సంకేతాలను పంపించినట్లవుతుందని మోదీ సంకేతాలు పంపినట్లు కూడా వుంది.
అయితే.. మరో అంశం కూడా వుంది. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ర్యాలీల సందర్భంగా ‘‘ఖేలా హోబే’’ అంటూ ప్రచారాన్ని చేశారు. దీంతో ఈ వ్యూహం అత్యంత ప్రజాదరణ పొందింది.ఇది ఓటర్లకు బాగా ఆకట్టుకోగలిగింది. ఎక్కువగా మాట్లాడకుండా, మమతా బెనర్జీ కేవలం ఫుట్ బాల్ ఆట ద్వారా కావాల్సిన రాజకీయ ప్రచారాన్ని పూర్తి చేశారు మమత.
ఇక.. సిక్కిం 50 వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధానమని మోదీ పేర్కొన్నారు. అందువల్లే రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత పెంచేందుకు తమ కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సిక్కిం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెబుతోందన్నారు.
ఇవి కూడా చదవండి








