సోనియా గాంధీతో మమతా బెనర్జీ కీలక భేటీ
ఇండియా కూటమి సమావేశం తర్వాత మాజీ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తృణమూల్ లో తిరుగుబాట్లు, సంక్షోభం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 25 పార్టీల ప్రతినిధులతో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అలాగే సోనియా గాంధీ కూడా అందులో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు.
ప్రతిపక్ష కూటమిలో భాగమైనప్పటికీ, టీఎంసీ (TMC) మరియు కాంగ్రెస్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈ భేటీ జరిగింది.
అయితే.. చాలా రోజులుగా కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదాలు వున్నాయి. కానీ.. వీటన్నింటినీ పక్కనపెట్టి, మమతా బెనర్జీ సోనియాతో భేటీ అయ్యారు. అంతేకాకుండా ప్రతిపక్ష కూటమి TMC అధినేత్రికి అండగా గట్టిగా నిలబడిందనే సందేశాన్ని ఈ చర్య ఇస్తున్నట్లుగా ఇందులో పాల్గొన్నవారు భావించారు.
సమావేశానికి ముందు సోనియా గాంధీ, మమతా బెనర్జీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న చిత్రాన్ని టీఎంసీ కూడా పోస్ట్ చేసింది. “మాటలు చెప్పలేనిదాన్ని ఆ చిరునవ్వులు చెప్పాయి… దేశానికి దశాబ్దాల అంకితమైన సేవ ద్వారా బలపడిన బంధం,” అని ఆ పార్టీ రాసింది.








