మళ్లీ బీజేపీ, అకాలీదళ్ ఒక్కటవుతున్నాయా? భేటీపై ఊహాగానాలు
పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అక్కడి రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం జరిగింది. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. దాదాపు నాలుగైదు సంవత్సరాల తర్వాత ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని అప్పుడే ఊహాగానాలు కూడా ప్రారంభమయ్యాయి.
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో అకాలీదళ్ ఎన్డీఏ (NDA) కూటమి నుంచి బయటకు వచ్చింది. దాంతో దాదాపు 25 ఏళ్ల నాటి వీరి పొత్తుకు తెరపడింది. పొత్తు విడిపోయిన తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవకపోగా, అకాలీదళ్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తిరిగి రెండు పార్టీలూ కలిసి ఎన్నికల గోదాలోకి దిగనున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్ల్ అకాలీదళ్ కి విపరీతమైన పట్టు వుంది. దీంతో తాము కూడా లాభపడాలని, ఎలాగైనా పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వుంది.
అయితే..ఇప్పుడు బీజేపీ చాలా బలంగా వుంది. ఈ సమయంలో సీట్ల పంపిణీ విషయంలో ఎవరిది పెద్ద చేయి అవుతుందనేది తేలాల్సి వుంది. గతంలో అకాలీదళ్ పెద్ద భాగస్వామి, బీజేపీ చిన్న భాగస్వామిగా వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంటుందా? లేదంటే కాస్త వెనక్కి తగ్గి, అకాలీదళ్ కి ఇస్తుందా? అన్నది వేచి చూడాలి.








