హారర్ కామెడీతో ‘కొరియన్ కనకరాజు’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: వరుణ్ తేజ్ కొణిదెల, రితికా నాయక్, దక్షా నగార్కర్, కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, అవసరాల శ్రీను, టెంపర్ వంశీ, బుల్లిరాజు, వీటీవీ గణేష్, తులసి తదితరులు నటించారు
సంగీతం : థమన్ ఎస్
సినిమాటోగ్రఫి : మనోజ్ రెడ్డి,
ఎడిటర్ : సత్య జీ, ఆర్ట్ డైరెక్టర్: ఏ పన్నీర్ సెల్వమ్,
పాటలు : శ్యామ్ కాసర్ల,
కొరియోగ్రఫి : యశ్వంత్ మాస్టర్
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేది :07.08.2026
నిడివి : 2 ఘంటల 45 నిముషాలు
కొరియన్ కనకరాజు (Korean Kanaka Raju) సినిమాతో వరుణ్ తేజ్, (Varun Tej)రితికా నాయక్,(Rithika Nair) సత్య (Satya)ఈ రోజు ఆగస్ట్ 7న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు వేయడంతో మంచి సందడి మొదలైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం లో సత్య కామెడీ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ సినిమా కథ ఏంటి? అన్నది ఓ సారి సమీక్షలో చూద్దాం.
కథ :
రాయలసీమలోని పెనుగొండలో కనకరాజు (వరుణ్ తేజ్), అతను కాస్త కోపిష్టి. స్నేహితులు. కనకరాజు తన కుల వృత్తి చెక్క బజన వాయించడం చేస్తే.. కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలోనే ఈ చెక్క భజన బృందం కూడా ఉంటుంది. కనకరాజు తండ్రి చెంగారెడ్డి (సునీల్) వద్ద మునుస్వామి (చిన్నా) అప్పు చేస్తాడు. అప్పు కంటే వడ్డీనే ఎక్కువ కట్టాం కదా అని చెంగారెడ్డి మనుషులతో కనకరాజుకి గొడవ జరుగుతుంటుంది. పెనుగొండలో కియా ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను తొలిచూపులోనే కనకరాజు ప్రేమించేస్తాడు. చైత్రకు కే-పాప్, కొరియన్ సంస్కృతి అంటే విపరీతమైన పిచ్చి. కనకరాజుకు చెంగారెడ్డి శ్రీను (టెంపర్ వంశీ) గ్యాంగ్‌కు గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కనకరాజును కొరియన్ దెయ్యం ఆవహిస్తుంది. ఆ దెయ్యాన్ని వదిలించుకోవడం కోసం కనకరాజు, కిష్టప్ప, చైత్ర ముగ్గురు కొరియాలో అడుగుపెడుతారు.
పెనుగొండలో చెంగల్ రెడ్డికి కనకరాజు మధ్య వైరం ఎందుకు? కనకరాజును శ్రీను గ్యాంగ్ ఎందుకు చంపాలని ప్లాన్ వేస్తారు? ఏ పరిస్థితుల్లో కనకరాజును కొరియన్ దెయ్యం ఆవహించింది? కనకరాజునే కొరియా దెయ్యం పట్టింది? కొరియా దెయ్యాన్ని వదిలించుకోవడానికి కిష్టప్ప తండ్రి (మురళీధర్ గౌడ్) ఏం చేశాడు? కొరియాకు కనకరాజును పట్టిన దెయ్యానికి ఏమిటి సంబంధం? కొరియాలో కనకరాజుకు ఎదురైన సమస్యలు ఏమిటి? కనకరాజు సోదరుడు (అవసరాల శ్రీను)కు కొరియాలో ఎదురైన సమస్య ఏమిటి? చివరకు కొరియా దెయ్యాన్ని కనకరాజు వదలించుకొన్నాడా? లేదా కొరియాలోనే కనకరాజు ఉండిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కొరియన్ కనకరాజు సినిమా కథ.
నటీ నటుల హవబవాలు :
ఫస్టాఫ్‌లో వరుణ్ తేజ్ మాస్ అప్పీల్, సెకండాఫ్‌లో స్టైలిష్, యాక్షన్ డ్రామాతో ఆకట్టుకొన్నాడు. ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టైమింగ్‌తో మెప్పించాడు. రెండు వేర్వేరు గెటప్పులలో కనిపించి మెప్పించాడు. నాటు కనకరాజుగా, అదే సమయంలో స్టైలిష్ కొరియన్ కుర్రాడిగా వైవిధ్యం చూపించాడు. ఇక ఈ సినిమాలో మరోసారి కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్‌తో చెలరేగిపోయాడు. సినిమా భారన్నంతా తన భుజాలపైనే మోశాడు. సినిమా మొత్తంలో ఎక్కువ స్పేస్‌ను సత్యనే లాగేసుకొన్నాడనే చెప్పొచు. ఇక మురళీధర్ గౌడ్ కూడా తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. రితికా నాయక్ విషయానికి వస్తే.. గ్లామర్‌పరంగా ఆకట్టుకొన్నారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వరుణ్ తేజ్‌తో కలిసి మంచి రొమాంటిక్ కెమిస్ట్రీని పండించారు. సునీల్, అవసరాల శ్రీను, టెంపర్ వంశీ, బుల్లిరాజు, వీటీవీ గణేష్, తమ పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు ఓకే. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగా కుదిరింది. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం కొరియన్ పోర్షన్స్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ సత్యా ఎక్కడా గ్రాఫ్ తగ్గకుండా పకడ్బందీగా ఎడిట్ చేశారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు గాంధీ చేసిన అటెంప్ట్‌గా పెద్దగా ఆకట్టుకోదు. సెకండాఫ్ మొత్తం తన కన్వినియెంట్ ప్రకారం సీన్లు రాసుకోవడం, పాత్రలను సీన్లలోకి జొప్పించడంతో చాలా ఇంటెలింజెట్గా వ్యవహరించారు. చివర్లో కొరియన్ కనకరాజ్ 2 ఇచ్చిన లీడ్ బాగుంది. ఫుల్ ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. గొప్పగా ఊహించుకొని ఎమోషనల్ అయ్యే స్టోరీ ఏ మాత్రం కాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సినిమా మొదలైన అర్ధగంట వరకు ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా రొటీన్ సీన్లు, క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కొనసాగడంతో సినిమా ల్యాగ్‌తో, బోర్‌గా సాగించాడు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
విశ్లేషణ :
సినిమా మొదలైన అర్ధగంట వరకు ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా రొటీన్ సీన్లు, క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కొనసాగడంతో సినిమా ల్యాగ్‌తో, బోర్‌గా సాగుతుంది. ఎప్పుడైతే కనకరాజును కొరియన్ దెయ్యం పడుతుందో.. అసలు కథ మొదలవ్వడమే కాకుండా డిఫరెంట్ జోన్లోకి తీసుకెళ్తుంది. కొరియాలో జరిగే కథకు కనకరాజును కనెక్ట్ చేసి.. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను నడిపించిన విధానం ఫస్టాఫ్‌కు హైలెట్ మాత్రమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచేలా చేస్తుంది. ఇక ఫస్టాఫ్‌లో సత్యతో కలిపి వరుణ్ తేజ్ చేసిన కామెడీ ట్రాక్‌తో సినిమా ఓ ఫన్ రైడ్‌లా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కొరియాలో జరిగే మాఫియా వార్, అక్కడి గ్రూపుల మధ్య ఫైట్స్‌తో మొత్తంగా స్టోరీ యాక్షన్ జోన్లోకి వెళ్తుంది.
ఇక సెకండాఫ్‌లో సత్య, మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్ సినిమాకు మరింత బలంగా మారింది. కామెడీ ట్రాక్‌లో సత్య, మురళీధర్ చేసిన ఫెర్ఫార్మెన్స్ కడుపుబ్బ నవ్వించేలా చేస్తుంది. కొరియా వెళ్లాక జరిగే సంఘనటలు నవ్వు తెప్పిస్తూనే ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. క్లైమాక్స్ పర్వాలేదు. ఇలాంటి హారర్ కామెడీ జోనర్లలో పెద్దగా లాజిక్స్ పట్టించుకోరు. అందుకే కేవలం కామెడీపైనే ఫోకస్ పెట్టి సినిమాను తీర్చిదిద్దినట్లుగా అనిపిస్తుంది. అయితే, అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు. సినిమా ధియేటర్ కీ వెళ్ళిన ప్రేక్షకుడికి ఫుల్ కామెడీ మీల్స్ తో సంతృప్తి చెందుతాడు.








