మా షరతులు అంగీకరించండి.. బిల్లు ఆమోదించుకోండి : డీఎంకే మెలిక
డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సభలో ప్రవేశపెట్టాలని, అందరి సపోర్ట్ తీసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రయత్నాలను కూడా చేస్తోంది. కానీ.. ఇది రాజకీయంతో, అధికారంతో ముడిపడి వున్నఅంశం కావడంతో ప్రతిపక్షాలు కూడా అంతే ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంటున్నాయి. అయితే.. డీలిమిటేషన్ బిల్లుకి డీఎంకే ని కూడా ఎన్డీయే మద్దతు కోరుతోంది. డీఎంకే ఇందుకు ఇదమిత్థంగా అంగీకరించింది. అయితే.. డీఎంకే మాత్రం ఎన్డీయేకి షరతులు పెట్టింది. ఈ మూడు షరతులను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని డీఎంకే తేల్చి చెప్పింది.
డీఎంకే మొదటి షరతు.. 1971 జనాభాలెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను యథాతథంగా వుంచే విధానం 2027 లో ముగియనుంది. దీనిని యథాతథంగా వుంచాలని డీఎంకే మొదటి షరతు. రెండవది, అన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాలను 50 శాతం మేర ఏకరీతిగా పెంచాలి. దీనిపై అమిత్ షా మౌఖికంగా ఓకే అన్నారని డీఎంకే చెబుతోంది.
ఇక డీఎంకే మూడో షరతు..కొత్త చట్టంతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సవరించిన లోక్సభ నియోజకవర్గాల పూర్తి జాబితాను కూడా కేంద్రం ప్రచురించాలని డీఎంకే కోరుతోంది.ఈ మూడు షరతులను అంగీకరిస్తే.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వడానికి తాము వెంటనే ముందుకు వస్తామని డీఎంకే అంటోంది. అయితే.. దీనిపై కేంద్రం నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదని సమాచారం.
మూడోది రాష్ట్రాలకు సంబంధించిన సవరించిన లోక్సభ నియోజకవర్గాల పూర్తి జాబితాను కూడా కేంద్రం ప్రచురించాలని డీఎంకే కోరుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (Delimitation Bill) రాష్ట్రాల ప్రయోజనాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంటూ డీఎంకే (DMK) ఇప్పటివరకు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీతో డీఎంకే పొత్తు ముగిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.








