ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. సీఎస్ఏఎమ్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేసిన మెటా.. కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించింది. అంతే కాకుండా తమ ఫ్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా అంగీకరించింది.
కాగా.. ప్రధాని మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటాను పార్లమెంటరీ కమిటీ బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు దిగొచ్చిన మెటా.. మోదీని క్షమాపణలు చెప్పింది.
మరో వైపు మెటా ప్రతినిధులు కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మెటా పక్షాన చీఫ్ గ్లోబర్ ఆఫీసర్స్ జోయెల్ కాప్లన్ తో పాటు పలువురు హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది.








