ఉదయనిధి స్టాలిన్ అరెస్టు, విడుదల చేయమన్న హైకోర్టు
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ఉదయనిధి స్టాలిన్‌ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్‌కు సూచించింది. సోమవారం తంజావూరులో కర్ణాటక,తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయం దుమారం రేగింది. దీనిపై అధికార టీవీకే పార్టీతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.








