హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం : కేటీఆర్
ఆజాద్ ఇంజనీరింగ్ (Azad Engineering), డీఆర్డీఓ (DRDO) సంయుక్తంగా సాధించిన చరిత్రాత్మక విజయంపై బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) స్పందించారు. 350 కేజీల మొట్టమొదటి స్వదేశీ థ్రస్ట్ క్లాస్ ఎక్స్పెండబులు టర్బోజెట్ ఇంజిన్‌ను విజయవంతంగా తయారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ( Hyderabad)తో పాటు భారత్ (India)కి ఇది ఒక గర్వించదగిన మైలురాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశపు స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాల్ని, రక్షణ రంగంలో స్వావలంబనను ఇది గణనీయంగా బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఎయిరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగాలు సాధించిన పురోగతికి ఈ జెట్ ఇంజిన్ ఉత్పత్తి నిదర్శనమని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్‌కు ఇది ఊతం అవుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి ఎరోస్పేస్ హబ్‌గా మారిన హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.








