బ్లాక్ ఫ్రాక్ లో క్లాసీ లుక్ లో నేహా ధూపియా
బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా(Neha Dhupia) గురించి, ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ తో వార్తల్లో నిలుస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేసే నేహా తాజాగా లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెమొరీస్ ను గుర్తు చేసుకుంటూ ఆ ఈవెంట్ కోసం ధరించిన గౌన్ ఫోటోలను షేర్ చేసింది. ఈ గౌన్ వీ నెక్ లైన్, స్లీవ్స్ తో పర్ఫెక్ట్ ఫిట్ తో ఉండటంతో నేహాకు ఈ అవుట్‌ఫిట్ రాయల్ లుక్ ను తెచ్చి పెట్టింది. దీనికి తోడు స్లిక్ హెయిర్ స్టైల్, బ్లాక్ పంప్స్ లో క్లాసీగా ఉంటూనే మోడ్రన్ లుక్ లో అదరగొట్టింది. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








