తెలుగు జాతి కోసం రెండు రాష్ట్రాలు .. అభివృద్ధి చేశా : సీఎం చంద్రబాబు
రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థికశాఖ (Finance Department) పై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం చెబుతున్నా. ఇదొక చారిత్రక ఆంశం. ఇప్పటి వరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. ఎప్పటికప్పుడు ప్రొగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవం నిదర్శనం. ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో అన్నదానికి భోగాపురం ఉదాహరణ. భవిష్యత్తు అనుసంధానానికి అంతర్జాతీయ గేట్వేగా తయారు చేశాం. రెండు రాష్ట్రాలు కూడా నేను అభివృద్ధి చేశా. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశాం. పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రస్ఫుటం అవుతాయి. ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం అని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.95,231 గా ఉండేది. విభజన తర్వాత తెలంగాణ (Telangana) తలసరి ఆదాయం రూ.1,24,104, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.93,903. ఈ పరిస్థితుల నుంచి సీఏజీఆర్ 13.5 శాతం వృద్ధి స్థాయికి చేరాం. 201924 మధ్య జీఎస్డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గింది. వృద్ధిరేటు తగ్గడంతో రూ.6.94 లక్షల నష్టం జరిగింది అని వివరించారు.








