జుట్టు చివర్లు చిట్లిపోవడం (Split Ends) చాలా మందిలో కనిపించే సమస్య. సరైన సంరక్షణ లేకపోతే జుట్టు పొడిగా, నిర్జీవంగా మారి అందాన్ని కోల్పోతుంది.
హెయిర్ స్ట్రెయిటెనర్, కర్లర్, బ్లో డ్రయ్యర్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టులో తేమ తగ్గి చివర్లు చిట్లే ప్రమాదం పెరుగుతుంది.
అధిక హీట్ స్టైలింగ్
హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, రీబాండింగ్, కెరాటిన్ వంటి ట్రీట్మెంట్స్ను తరచూ చేయించడం జుట్టు బలహీనపడేలా చేస్తుంది.
తరచూ కెమికల్ ట్రీట్మెంట్స్
షాంపూ తర్వాత కండీషనర్ ఉపయోగించకపోతే జుట్టు తేమ కోల్పోయి పొడిబారి చివర్లు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కండీషనర్ వాడకపోవడం
ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్, ఒమెగా-3 వంటి పోషకాలు తక్కువగా ఉంటే జుట్టు బలహీనమై సులభంగా చిట్లిపోతుంది.
పోషకాల లోపం
తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం లేదా వెంటనే దువ్వడం వల్ల జుట్టు తెగిపోవడంతో పాటు స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
తడి జుట్టును రుద్దడం
8–12 వారాలకు ఒకసారి జుట్టు చివర్లను ట్రిమ్ చేయకపోతే చిన్న చిట్లింపులు పెరిగి మొత్తం జుట్టును దెబ్బతీస్తాయి.
జుట్టు ట్రిమ్ చేయకపోవడం
ఎక్కువసేపు ఎండలో తిరగడం, కాలుష్యం, దుమ్ము కారణంగా జుట్టు తేమ కోల్పోయి పొడిబారి చిట్లే అవకాశం పెరుగుతుంది.
ఎండ, కాలుష్యం ప్రభావం
వేడి నీటితో తలస్నానం, గట్టిగా జుట్టు కట్టుకోవడం, నాసిరకం హెయిర్ ఉత్పత్తులు వాడటం కూడా స్ప్లిట్ ఎండ్స్‌కు కారణమవుతాయి.
తప్పు హెయిర్ కేర్ అలవాట్లు