రూట్ మార్చేసిన ప్రధాని మోదీ… రీల్స్ మాధ్యమంగానే…
దేశంలో జెన్ జీ ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో సోషల్ మీడియా ప్రముఖ పాత్రే పోషించింది. దీంతో రాజకీయ నేతలు కూడా అలర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా నిత్యం టెక్నాలజీని వాడటంలో ముందుండే ప్రధాని మోదీ టెక్నాలజీని మరింత విస్తృతంగా వాడేస్తున్నారు. ఏది చెప్పాలన్నా, వీడియో రూపంలోనే తన సందేశాన్ని ఇస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ ఏకంగా నాలుగు వీడియోల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అందులో ‘‘ఫ్రెండ్స్’’ అంటూనే సంబోధించారు. అప్పటి నుంచి ఇక.. వీడియోల ద్వారానే తన సందేశాన్ని పంపిస్తున్నారు.
తాజాగా కూడా ప్రధాని మోదీ ఇదే చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మోదీ, ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో కూడా యువతనే టార్గెట్ గా చేస్తూ సంభాషించారు.ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్‌ను పోస్ట్ చేస్తూ, చేనేత దుస్తులతో “గెట్ రెడీ విత్ మీ” (GRWM) వీడియోలను రూపొందించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని యువ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రెండ్ భారతదేశపు గొప్ప నేత సంప్రదాయాన్ని ప్రదర్శించడానికి మరియు కళాకారుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
చేనేత వస్త్రాలు ధరించి భారతీయ చేనేత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు చేనేత కార్మికులకు, చిరు వ్యాపారులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చేలా చిన్న వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. 1905 ఆగస్టు 7న బ్రిటీషర్లకు వ్యతిరేకంగా భారతీయులు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారని ఆయన తన వీడియో సందేశంలో తెలిపారు.








