భారత్ ధర్మ సత్రం కాదు.. వారిని పంపించేస్తాం : అమిత్ షా
అసోంలో అత్యంత ప్రధానమైన సమస్య అక్రమ చొరబాటుదారులు. దీని చుట్టే ఎన్నికలు కూడా తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు దీనిపైనే సవాళ్లు, ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ధర్మసత్రమేమీ కాదని, చొరబాటుదారులకు ఇక్కడ స్థానం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ గనక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు వస్తుందని, బెంగాల్ లో వున్న చొరబాటుదారులను తిరిగి వారి దేశాలకు పంపేస్తామని ప్రకటించారు. దేశంలోని అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపడం ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయని, పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం గూఢచర్యం చేసే వ్యక్తులకు దేశంలో స్థానమే లేదన్నారు. అయితే.. వారికి స్థానం లేదన్న విషయం కాంగ్రెస్ కి బాగా తెలుసని, అయినా.. రెడ్ కార్పేట్ వేసి మరీ అక్రమ చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తోందని మండిపడ్డారు. “మేము చొరబాటుదారులను గుర్తించాము; ఇప్పుడు వారిని ఒక్కొక్కరిగా దేశం నుండి పంపించివేసే సమయం ఆసన్నమైంది,” అని పేర్కొన్నారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఉన్న ‘శ్రీభూమి’కి బీజేపీ పేరు మార్చిందని, అయితే కాంగ్రెస్ మాత్రం అక్రమ వలసదారుల ఓట్ల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. “కాంగ్రెస్ ఈ ప్రాంతంలో అక్రమ చొరబాటుదారులనే మెజారిటీ వర్గంగా మార్చేసింది; అస్సాం అంతటా కూడా అదే చేయాలని అది భావిస్తోంది,” అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి








