దక్షిణాదికి అన్యాయం అనేది అవాస్తవం: అమిత్ షా
Amit Shah: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దక్షిణాదిలోని ప్రధాన రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు ఏ మేరకు పెరుగుతాయో అంచనాలతో కూడిన వివరాలను వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ..
అమిత్ షా వెల్లడించిన వివరాల ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న 17 స్థానాలు 26కి చేరుతాయని ఆయన తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ..
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్ల సంఖ్య పెరగనుందని హోంమంత్రి వివరించారు. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు, తమిళనాడులో 39 నుంచి 59 కు, కేరళలో 20 నుంచి 30 స్థానాలకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అవాస్తవాల ప్రచారం..
దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఆయా రాష్ట్రాల జనాభా శాతం కంటే ఎక్కువగా ఉంటాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు అనవసరపు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతుందని, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి








