Spain: అమెరికాకు స్పెయిన్ భారీ షాక్.. ఇరాన్ యుద్ధ విమానాలకు గగనతలం మూసివేత!
పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధానికి యూరప్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమాసియా ఆపరేషన్లలో పాల్గొనే అమెరికా సైనిక విమానాలకు తమ గగనతలాన్ని (Airspace) పూర్తిగా మూసివేస్తున్నట్లు స్పెయిన్ (Spain) సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో జరుగుతున్న ఈ ఘర్షణల్లో పాలుపంచుకునే ఏ ఒక్క అమెరికా యుద్ధ విమానాన్ని తమ గగనతలం గుండా అనుమతించే ప్రసక్తే లేదని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరెటా రొబెల్స్ (Margarita Robles) అధికారికంగా వెల్లడించారు.
సైనిక స్థావరాలకు నో ఎంట్రీ
వ్యూహాత్మకంగా అమెరికాకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగించే అంశం. సాధారణంగా యూరప్ మీదుగా మధ్యప్రాచ్యానికి వెళ్లేందుకు అమెరికాకు స్పెయిన్ (Spain) ఎంతో కీలకం. అయితే రెండు దేశాలు దశాబ్దాలుగా సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సైనిక స్థావరాలను (Joint Military Bases) సైతం తాజా పశ్చిమాసియా ఆపరేషన్ల కోసం వినియోగించడాన్ని స్పెయిన్ ఇప్పటికే నిరాకరించింది. ఇరాన్‌పై దాడులు చేయడానికి, ఆయుధాలు సరఫరా చేయడానికి స్పెయిన్ గడ్డను లేదా ఆకాశాన్ని వాడుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దీంతో అమెరికా బలగాలు ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాలను వెతుక్కోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం
తమ దేశం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను స్పెయిన్ (Spain) రక్షణ, ఆర్థిక మంత్రులు స్థానిక మీడియాకు స్పష్టంగా వివరించారు. “ఇరాన్‌పై ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు పూర్తి విరుద్ధంగా ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. చట్టవిరుద్ధమైన ఈ ఘర్షణలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించకూడదని మా ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం మా మిలిటరీ స్థావరాలను గానీ, గగనతలాన్ని గానీ వినియోగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోం” అని (Spain) వారు కుండబద్దలు కొట్టారు.
వాణిజ్యం నిలిపేస్తామన్న ట్రంప్
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులను స్పెయిన్ (Spain) ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ (Pedro Sánchez) తొలి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప, విధ్వంసకర యుద్ధం తగదని ఆయన వాదిస్తున్నారు. స్పెయిన్ ప్రదర్శిస్తున్న ఈ ధిక్కార వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నాటో (NATO) మిత్రదేశంగా ఉంటూ తమకు సహకరించకపోవడంపై మండిపడుతున్న ఆయన.. స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను (Trade Relations) పూర్తిగా నిలిపివేస్తామని ఇప్పటికే పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి








