Iran: ఆంక్షల అడ్డంకిని దాటి.. ఇరాన్ యుద్ధ ఖర్చుల వెనుక రహస్యాలివే!
అమెరికా విధించిన వేల కొద్దీ అంతర్జాతీయ ఆంక్షలు.. పాతాళానికి పడిపోయిన కరెన్సీ.. భయంతో దూరంగా ఉంటున్న మిత్రదేశాలు. ఇదీ ప్రస్తుతం ఇరాన్ (Iran) పరిస్థితి. ఒకవైపు ఆదాయ మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయినా, మరోవైపు గత నెల రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్‌తో భీకర యుద్ధం (War) చేస్తోంది. ఆధునిక కాలంలో యుద్ధం చేయడమంటే కరెన్సీ కట్టలను నీళ్లలా ఖర్చు చేయడమే. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య ఇరాన్‌కు అపారమైన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే ఇరాన్ అమలు చేస్తున్న మూడు మాస్టర్ మైండ్ వ్యూహాలు వెలుగులోకి వస్తాయి.
ఇవి కూడా చదవండి
1. క్రిప్టో కనకవర్షం (Crypto Mining):
అంతర్జాతీయ చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో ఇరాన్ తన వద్ద ఉన్న అపారమైన చమురు, విద్యుత్ వనరులను ‘క్రిప్టో మైనింగ్’కు మళ్లించింది. చైనా సహకారంతో 2019లోనే బిట్‌కాయిన్ (Bitcoin) మైనింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇరాన్లో ఒక బిట్‌కాయిన్ తయారు చేయడానికి కేవలం 1,300 డాలర్లు ఖర్చవుతుండగా.. దాన్ని అంతర్జాతీయ మార్కెట్లో 60 వేల నుంచి 75 వేల డాలర్లకు విక్రయిస్తోంది. అమెరికా బ్యాంకింగ్ ఆంక్షలు (SWIFT) క్రిప్టో కరెన్సీపై పనిచేయవు కాబట్టి, ఇరాన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా బిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జిస్తోంది. ఒక్క 2025 నాటికే ఇరాన్ (Iran) వద్ద 7.78 బిలియన్ డాలర్ల క్రిప్టో సామ్రాజ్యం ఉన్నట్లు అంచనా.
2. పాత నౌకలు – షాడో ఫ్లీట్ (Shadow Fleet):
అంతర్జాతీయ నిఘా కళ్లగప్పేందుకు ఇరాన్ పాతబడిన నౌకలను తుక్కు కింద కొనుగోలు చేస్తోంది. వాటికి రంగులు, పేర్లు మార్చి ఇతర దేశాల్లో రిజిస్టర్ చేసి.. వాటి ద్వారా రహస్యంగా ముడి చమురును రవాణా చేస్తోంది. సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురును మారుస్తూ గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటోంది. ఒక్క 2025లోనే ఇలాంటి ‘షాడో ఫ్లీట్’ ద్వారా దాదాపు 3.7 బిలియన్ బ్యారెళ్ల చమురును ఇరాన్ (Iran), రష్యా దేశాలు తరలించినట్లు సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
3. ‘అఘాజాదే’ (Aghazadeh) నెట్వర్క్:
ఇరాన్ (Iran) ఆర్థిక వ్యవస్థ అంతా ఆ దేశ సుప్రీం లీడర్ల చేతుల్లో, వారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంటుంది. దీన్నే ‘అఘాజాదే’ (ఉన్నత వర్గాల పిల్లలు) వ్యవస్థ అంటారు. అధికార యంత్రాంగంపై పూర్తి విశ్వాసం ఉన్న ఈ కుటుంబాలే విదేశాల్లో ఇరాన్ వాణిజ్యాన్ని, ఆయుధ కొనుగోళ్లను రహస్యంగా నడిపిస్తాయి. ఉదాహరణకు, దుబాయ్ కేంద్రంగా ఇరాన్ చమురు, ఆయుధాల నెట్‌వర్క్‌ను ‘హెచ్’ (H) అనే కోడ్ నేమ్‌తో ఇరాన్ మాజీ సెక్యూరిటీ చీఫ్ కుమారుడైన హుస్సేన్ షంఖానీ (Hossein Shamkhani) నడిపిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) రిపోర్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి








