Iran: ఇరాన్ కొత్త రూల్.. హర్మూజ్ జలసంధి దాటాలంటే రూ.18 కోట్లు రుసుము !
Iran: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే శత్రు దేశాల నౌకలను అడ్డుకుంటామని, మిగిలిన నౌకల నుంచి భారీగా రుసుము వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ట్రాన్సిట్ ఫీజు వసూలు: జలసంధిని దాటే ప్రతి నౌక నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున ఫీజు వసూలు చేయడం ఇప్పటికే ప్రారంభించినట్లు ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది వెల్లడించారు. యుద్ధం వల్ల పెరుగుతున్న ఆర్థిక భారమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ హెచ్చరిక – ఇరాన్ స్పందన: వచ్చే 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అయితే, దీనికి ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్, తమ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే.. తాము బదులుగా ఇజ్రాయెల్ ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
ప్రపంచ ఇంధన భద్రత: ఒకవేళ ఉద్రిక్తతలు మరింత పెరిగితే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ గతంలోనే ప్రకటించింది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి, అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.
ప్రస్తుతానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అనుసరిస్తున్న ఈ వ్యూహంతో అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








