Iran: ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే 1980 సీన్ రిపీట్ అవుతుంది : ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా దిగి, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటుందని వాదనలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ట్రంప్ కి స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. ఇదే గనక చేస్తే పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పరిచేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ మేరకు ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఈ విషయాన్ని రాయిటర్స్ పేర్కొంది. ఇదే గనక జరిగితే షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తమ తీరం నుంచే సీమైన్స్ ను జలాల్లోకి ప్రవేశపెడతామని ఇరాన్ పేర్కొంది.
1980 లో స్వల సంఖ్యలోనే తాము సీమైన్స్ ని పరిచామని, వీటినే తొలగించడానికి 100 మైన్ స్వీపర్లు ప్రయత్నించిన విఫలమైన విషయాన్ని మరిచిపోవద్దని చురకలంటించింది. దాంతో సుదీర్ఘకాలం గల్ఫ్ ప్రాంతం అంతటా హర్మూజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే వుంటుందని పేర్కొంది. నిజానికి ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ఐలాండ్ అత్యంత కీలకమైంది.హర్మూజ్ ను తెరిచే విషయంలో ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఖర్గ్ ను ఆక్రమించాలన్న యోచనలో ట్రంప్ వున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కేవలం ఆలోచనే కాకుండా దీనికి తగ్గట్టుగా 4500 మంది సెయిలర్లు, మెరైన్లను కూడా మోహరించింది.








