Hormuz Strait: హార్ముజ్ వద్ద విషాదం.. భారతీయ కెప్టెన్ ఆకస్మిక మృతి..!
పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ భారత్‌కు చమురుతో వస్తున్న వాణిజ్య నౌక (Oil Tanker) కెప్టెన్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధి (Hormuz Strait) సమీపంలో విధుల్లో ఉన్న రాకేశ్ రంజన్ (43) అనే భారతీయ కెప్టెన్ గుండెపోటుతో మృతి చెందారు.
ఉద్రిక్తతల్లో చిక్కుకున్న నౌక..
జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ ‘అవానా’ (Awana) అనే చమురు నౌకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నౌక భారత్‌కు బయలుదేరిన క్రమంలో యుద్ధ వాతావరణం కారణంగా హార్ముజ్ జలసంధికి (Hormuz Strait) 14 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయింది. నౌకలోనే ఉన్న ఆయన ఈనెల 18న అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ప్రాథమిక వైద్య సాయం అందించినా ఫలితం దక్కలేదు. ఆ ప్రాంతంలో ఉన్న యుద్ధ ఉద్రిక్తతల (War Tensions) కారణంగా, మెరుగైన వైద్యం కోసం ఆయనను అత్యవసరంగా విమానంలో (Airlift) తరలించేందుకు భద్రతా అనుమతులు లభించలేదు.
ఇవి కూడా చదవండి
దుబాయ్‌లో కన్నుమూత..
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయనను పడవ ద్వారా దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌కు తరలించగా, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. హార్ముజ్ (Hormuz Strait) వద్ద తీవ్రమైన గుండెపోటుతోనే ఆయన మరణించి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే కచ్చితమైన కారణాలు తెలియనున్నాయి.
ప్రభుత్వాలకు కుటుంబ విజ్ఞప్తి..
రాకేశ్ రంజన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోయి (Hormuz Strait) తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబం.. దుబాయ్ నుంచి ఆయన మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్‌లకు రాకేశ్ సోదరుడు అధికారికంగా లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి








