Iran War: ప్రపంచానికి ఇంధన గండం.. 1970ల నాటి భయంకర పరిస్థితులు మళ్లీ వస్తున్నాయా?
Iran War : ప్రపంచం గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ చూడని స్థాయి ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అధిపతి ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో (ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో) నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ధ్వంసమైన చమురు క్షేత్రాలు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఇప్పటికే 40కి పైగా ఇంధన క్షేత్రాలు దెబ్బతిన్నాయని, ఇది అంతర్జాతీయ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బిరోల్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
చారిత్రక సంక్షోభాల కంటే ప్రమాదకరం: 1970 నాటి చమురు సంక్షోభం, 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కలిగించిన గ్యాస్ కొరత కంటే ప్రస్తుత పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆనాటి షాక్లన్నీ ఇప్పుడు ఏకకాలంలో ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఈ ఇంధన కొరత “గోరుచుట్టుపై రోకలిపోటు”లా మారనుంది. ఇంధన మౌలిక సదుపాయాలు మరింత దెబ్బతింటే ధరలు నియంత్రణ కోల్పోయి, సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
పరిష్కారం దౌత్యమే: ఈ అనిశ్చితి నుంచి గట్టెక్కాలంటే ప్రపంచ దేశాలు తక్షణమే దౌత్యపరమైన చర్చలు జరపాలని, యుద్ధ మేఘాలను తొలగించడం ద్వారానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలమని ఐఈఏ సూచించింది.
ఇవి కూడా చదవండి








