Iran-US Conflict: అమెరికాకు సవాల్‌గా ఇరాన్ ‘మొజాయిక్’ డిఫెన్స్.. ఏమిటీ వ్యూహం?
Iran-US Conflict: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇరాక్‌పై కేవలం నెల రోజుల్లోనే విజయం సాధించిన అమెరికా, ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే జరుగుతుందని భావించింది. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక మిలిటరీ కమాండర్లను అంతమొందించినప్పటికీ, ఇరాన్ గత 13 రోజులుగా పట్టువదలకుండా ప్రతిఘటిస్తూనే ఉంది. అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా ఇరాన్ కుప్పకూలకుండా ఉండటానికి కారణం మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ రూపొందించిన ‘మొజాయిక్ రక్షణ కవచం’.
ఏమిటీ మొజాయిక్ డిఫెన్స్?
2003లో ఇరాక్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ వైఫల్యాలను అధ్యయనం చేసిన జఫారీ, ‘డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్’ (వికేంద్రీకృత రక్షణ వ్యవస్థ)ను సిద్ధం చేశారు. ఇరాక్‌లో కమాండ్ వ్యవస్థ ధ్వంసం కాగానే సైన్యం చెల్లాచెదురైపోయింది. కానీ ఇరాన్లో అలీ జఫారీ ఐఆర్జీసీని (IRGC) 31 స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. ప్రతి విభాగానికి సొంత ఆయుధ సంపత్తి, డ్రోన్లు, క్షిపణులు , స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. దీనివల్ల దేశ రాజధాని లేదా ప్రధాన నాయకత్వంపై దాడులు జరిగినా, క్షేత్రస్థాయిలోని విభాగాలు హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా ముందే సిద్ధం చేసిన ప్రణాళికల ప్రకారం యుద్ధాన్ని కొనసాగిస్తాయి.
ఇవి కూడా చదవండి
అగ్రరాజ్యానికి సవాల్:
ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తమ రాజధానిపై దాడులు చేసినంత మాత్రాన యుద్ధ సామర్థ్యం తగ్గదని, వికేంద్రీకరణ వ్యూహం వల్ల ఎక్కడ, ఎలా పోరాడాలో తమ దళాలకు తెలుసని హెచ్చరించారు. ఇరాన్ ఈ ‘దోమల దండు’ వ్యూహం పశ్చిమ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవంతో, జఫారీ నిర్మించిన ఈ రక్షణ వ్యవస్థ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు పెను సవాల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి








