రియాద్ విమానాశ్రయంపై దాడులు ఘోరం.. తీవ్రంగా ఖండించిన భారత్…
సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులను .. ప్రపంచదేశాలు ఖండించాయి. ముఖ్యంగా (India condemned). పౌర మౌలిక సదుపాయాలపై ఇటువంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది భారత్. ‘గత కొన్ని రోజులుగా రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరుగుతున్న దాడులు, ముఖ్యంగా అక్టోబర్ 10న జరిగిన దారుణమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవి తక్షణమే ఆగిపోవాలి. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఎందరో ప్రజలు గాయాలపాలయ్యారు. సౌదీలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం’ అని భారత్ పేర్కొంది.
పెరుగుతున్న మృతులు
సౌదీ (Saudi Arabia)లోని విమానాశ్రయంపై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 12కు చేరగా..300లకు పైగా ప్రజలు గాయాలపాలయ్యారని అధికారులు వెల్లడించారు. మృతులలో నలుగురు సౌదీ పౌరులతో పాటు ఇద్దరు బంగ్లాదేశీయులు, పాలస్తీనా, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సూడాన్ దేశస్థులు ఉన్నట్లు తెలిపారు. హూతీలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడిలో ఎయిర్‌పోర్టులోని పలు విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఈ క్షిపణి దాడితో విమానాశ్రయంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గడచిన 24 గంటల్లో 225 విమానాలు రద్దయినట్లు ఫ్లైట్అవేర్ ట్రాకింగ్ సైట్ పేర్కొంది. రియాద్‌కు రావలసిన విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు ఫ్లైట్ రాడార్24 తెలిపింది.
కాగా… హూతీలపై దాడుల్లో తాము కూడా పాల్గొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు








