TTA: ఫిలడెల్ఫియాలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.. మార్చి 28న TTA ఆధ్వర్యంలో వేడుకలు!
TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా విభాగం ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘శ్రీ సీతారాముల కల్యాణం’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు భక్తులందరినీ ఆహ్వానిస్తూ నిర్వాహకులు పోస్టర్ను విడుదల చేశారు.
కార్యక్రమ వివరాలు:
- తేదీ: మార్చి 28, 2026 (శనివారం).
- సమయం: ఉదయం 10:00 గంటల నుండి.
- వేదిక: లయన్విల్లే మిడిల్ స్కూల్, 550 W ఉచ్లాన్ ఏవ్, ఎక్స్టన్, PA 19341.
కార్యక్రమ ప్రత్యేకతలు:
ప్రవేశం, ప్రసాదం: ఈ వేడుకకు ప్రవేశం ఉచితం , భక్తులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు (RSVP తప్పనిసరి). భద్రాచలం నుండి తెప్పించిన లడ్డు ప్రసాదం , అక్షంతలు భక్తులకు పంపిణీ చేయనున్నారు.
డ్రెస్ కోడ్: హాజరయ్యే భక్తులు భారతీయ సాంప్రదాయ దుస్తులు (Indian Ethnic Wear) ధరించాలని కోరారు. జీన్స్ , షార్ట్స్ అనుమతి లేదు.
స్పాన్సర్లు:
ఈ కార్యక్రమానికి డా. పైళ్ళ మల్లారెడ్డి, ఫ్యామిలీ, డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, ఫ్యామిలీ గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు మల్లిక్ బుధవరపు, ప్రదీప్ కాయిదాపురం, ప్రమోద్ చెవ్వ, సుశాంత్ గోపిరెడ్డి, రఘు అలుగుబెల్లి, వినయ్ కందుల , పృథ్వీ బోడిగె కుటుంబాలు కల్యాణ స్పాన్సర్లుగా సహకరిస్తున్నారు.
కల్యాణ ఉత్సవంలో పాల్గొనదలచిన వారు లేదా స్పాన్సర్ చేయాలనుకునే వారు వినయ్ కందుల (+1 405-856-4744) లేదా ప్రమోద్ చెవ్వ (+1 845-853-5232)లను సంప్రదించవచ్చు. ఫిలడెల్ఫియా , పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారందరూ ఈ వేడుకకు తరలివచ్చి సీతారాముల కృపకు పాత్రులు కావాలని TTA కోరుతోంది.








