Peddi: పెద్ది చరిత్ర సృష్టిస్తుందా ?
రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `పెద్ది`. బుచ్చిబాబు సాన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చికిరి…రైరై రారా.. పాటలు సినిమాకు మరింత హైప్‌ని తీసుకొచ్చాయి.
రంగస్థలంలో చెర్రీ చూపించిన నటన ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఇప్పుడు పెద్దిలో కూడా అంతకుమించి మరో పవర్ ఫుల్ పాత్రతో మెప్పించబోతున్నారని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ కు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, చరణ్ ఇలాంటి బలమైన కథలు, పాత్రలు ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇంత వరకు క్రికెట్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అంతా భావించారు. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ రామ్ చరణ్ కొత్త స్టైల్ బ్యాటింగ్‌తో రచ్చ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. రెగ్యులర్ పంథాలో కాకుండా సరికొత్త స్టైల్లో చరణ్ బ్యాట్‌ని ఝుళిపించిన తీరు ప్రత్యేకంగా ఉండటంతో ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. టీజర్లో ఒక్క సీనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో..చరణ్ ఏ స్థాయిలో అదరగొట్టాడో అని అంతా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు మార్చి 27న `పెద్ది పహిల్వాన్` పేరుతో వీడియో రిలీజ్ చేసి షాక్ ఇవ్వడంతో అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియోలో రామ్‌చరణ్ పహిల్వాన్లా కుస్తీపడుతూ గురువుని మెప్పించే ప్రయత్నం చేస్తుండటంతో బుచ్చిబాబు ట్విస్ట్ ఇచ్చాడనే చర్చ మొదలైంది. `కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా..పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట` అని తాజా వీడియోలో కనిపించని స్వరం పెద్ది క్యారెక్టర్ని హెచ్చిరిస్తున్న తీరుని చూస్తుంటే ఈ కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగదని, క్రికెట్లో టాప్ అనిపించుకున్న ఓ యువకుడు కుస్తీ నేపథ్యంలో సాగు కథ అని క్లారిటీ వచ్చేసింది. ఒకే కథలో రెండు ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉండటంతో `పెద్ది`పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కున్న అభిమానుల్ని గురించి, ప్రత్యేకంగా ఇండియా వైడ్‌గా క్రికెట్‌ని అభిమానించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇదే స్థాయిలో కాకపోయినా కొంత వరకు కుస్తీ కూడా ఆసక్తిని రేకెత్తించిన క్రిడే. `దంగల్` తరువాత దీనిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఈ రెండు నేపథ్యాల్లో వచ్చిన సినిమాలు `లగాన్, `దంగల్`.
బ్రిటీష్ వారితో పోటీపడి క్రికెట్ ఆడి విముక్తిని పొందే ఓ ప్రాంతం వారి కథగా రూపొందిన `లగాన్` ఆస్కార్ గడపదాకా వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక తను సాధించలేని లక్ష్యాలని తన కూతుళ్లు సాధిస్తారని వారికి కుస్తీ నేర్పించి బరిలోకి దించి వారితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కప్లని సాధించిన ఓ తండ్రి విజయ గాధగా `దంగల్`ని రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పడు ఈ రెండు సినిమాల్లోని పాపులర్ గేమ్స్‌ని పెద్దిలో చూపిస్తూ ఇప్పటికే అందరిలో అటెన్షన్‌ని క్రియేట్ చేసిన బుచ్చిబాబు అదిరిపోయే ప్లాన్ వేశాడని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడే సినిమా బ్లాక్ బస్టర్ అని తేలిపోయిందని, సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా అంటున్నారు.
మరోవైపు ఈ చిత్రంలో రామ్ చరణ్ బాడీ విషయమై చర్చలు మొదలయ్యాయి. గతంలో విడుదలైన కొన్ని పెద్ద సినిమాల్లో బాడీ డబుల్స్‌కు హీరోల తలలను యాడ్ చేసినట్లు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి విజువల్స్ నేచురల్ గా అనిపించకపోవడం వల్ల అవి ఈజీగా బయటపడతాయి. కానీ పెద్ది చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ లో మాత్రం అలాంటి లక్షణాలు అసలు కనిపించడం లేదు. రామ్ చరణ్ బాడీ మేకోవర్ కంప్లీట్ నేచురల్ గా కనిపిస్తోంది. ఆయన కండరాలు, బాడీ షేప్, మూవ్మెంట్స్ చూస్తుంటే.. నిజంగా కష్టపడి సాధించిన ఫిట్నెస్ అని స్పష్టంగా అర్థమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఇచ్చే కథలో నటించడం ద్వారా ఆయన మరోసారి తన యాక్టింగ్ స్టామినాను నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన లుక్ వైరల్ అవుతోంది. అభిమానులు చరణ్ కొత్త అవతార్ ను చూసి ఫిదా అవుతున్నారు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెన్స్ లుక్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్ది సినిమా టోన్ పూర్తిగా రూటెడ్ గా, నేచురాలిటీకి దగ్గరగా ఉండనుందని మేకోవర్ ద్వారా అర్థమవుతోంది. పహిల్వాన్ గా కనిపించేందుకు చరణ్ చేసిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించబోతోందని చిత్రబృందం చెబుతోంది. బలం, పట్టుదల, ధైర్యం వంటి లక్షణాలను ఆ పాత్ర ద్వారా చూపించబోతున్నారని సమాచారం. ఇటీవలి కాలంలో పాత్ర కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకునే విషయంలో చరణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
రంగస్థలంలో చెర్రీ చూపించిన నటన ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఇప్పుడు పెద్దిలో కూడా అంతకుమించి మరో పవర్ ఫుల్ పాత్రతో మెప్పించబోతున్నారని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, చరణ్ ఇలాంటి బలమైన కథలు, పాత్రలు ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
రామ్ చరణ్ గతంలో కూడా తన పాత్రల కోసం బాడీ పరంగా ఎంతో కష్టపడ్డ విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో కొత్త లుక్ కోసం శిక్షణ తీసుకోవడం ఆయన అలవాటు. ఇప్పుడు పెద్ది చిత్రంలో పహిల్వాన్ పాత్ర కోసం కూడా ఆయన కఠినమైన వ్యాయామాలు, డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ఫలితమే పవర్ ఫుల్ లుక్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
పెద్ది చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. వీరిద్దరి కెమిస్ట్రీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, గ్రామీణ బ్యాక్‌డ్రాప్.. అన్ని కలగలిపిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లింప్స్ విడుదలతోనే ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.








