జైలర్3 పై నెల్సన్ మాస్టర్ ప్లాన్..
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth)కు జైలర్(jailer) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందించడంతో ఈ ఫ్రాంచైజీపై ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) మూడో భాగానికి సంబంధించిన ఆలోచనలను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. జైలర్2(jailer2) ముగింపులోనే తర్వాతి సినిమాకు సంబంధించిన హింట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. రజనీకాంత్, నెల్సన్(nelson) తీసుకుంటున్న రెమ్యూనరేషన్లతో పాటు ఇతర నిర్మాణ వ్యయాలు కూడా ప్రాజెక్ట్ స్థాయిని పెంచాయి. తెలుగు స్టేట్స్ రైట్స్ ను నిర్మాత నాగవంశీ(naga vamsi) భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది కీలకంగా మారింది. అంచనాలను అందుకోవడంతో పాటు పెట్టుబడులను రాబడితేనే మూడో భాగానికి మార్గం సుగమం కానుంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, జైలర్3(jailer3) ఆలోచనపై రజనీకాంత్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనతో పాటు నెల్సన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు తక్కువ. అన్నీ అనుకూలిస్తే 2028లో సన్ పిక్చర్స్(Sun pictures) ఈ సినిమాను మరింత భారీ స్థాయిలో నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 15న థియేటర్లలోకి రానున్న జైలర్2 చివర్లో ఇచ్చే హింట్ నిజంగానే మూడో భాగానికి బాటలు వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.








