ఈసారి ప్రభాస్ బర్త్‌డే స్పెషల్స్ ఏంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం తన తర్వాతి సినిమా ఫౌజీ(Fauzi)పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవడంతో కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ప్రస్తుతం మేకర్స్ గ్లింప్స్‌ను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అవుట్‌పుట్‌పై టీమ్ సంతృప్తి చెందితేనే దాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ గ్లింప్స్‌పై ఆసక్తి నెలకొంది.
స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాతో ప్రభాస్‌ను సరికొత్త నేపథ్యంలోని పాత్రలో చూసే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్(Spirit) షూటింగ్ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 40% షూటింగ్ పూర్తైంది. ఈ సినిమా నుంచి ప్రభాస్ బర్త్‌డే పోస్టర్‌ను అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నారు. మొదట 2027 మార్చిలో రిలీజ్ చేయాలని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫౌజీ లేటవడంతో స్పిరిట్ కూడా అదే ఇయర్ సెకండాఫ్ కు వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.








