సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొందిన హిలేరియస్ అడ్వెంచర్ మూవీ “చంద్రయాన్”
ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమారాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఇవి కూడా చదవండి
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కథా కథనాలతో మంచి ఎంటర్ టైనింగ్ సినిమా చేశారంటూ సెన్సార్ టీమ్ ప్రశంసించారు. ఇటీవలే రిలీజ్ చేసిన “చంద్రయాన్” చిత్ర గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నెల 30న థియేటర్స్ లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న అడ్వెంచర్ ఫన్ మూవీ చూడబోతున్నామనే ఇంప్రెషన్ ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో కలుగుతోంది.








