వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌కు నాని గుడ్‌బై.. కొత్త కథలతో బిజీ!
నేచురల్ స్టార్ నాని(nani) తన కెరీర్లో విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. అయితే నాని నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి(venky atluri)తో సినిమా చేసేందుకు డిస్కషన్స్ జరుపుతున్న నాని.. ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలొచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మాణంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ది ప్యారడైజ్(The paradise) ప్రమోషన్ల కోసం అమెరికా టూర్ కు వెళ్లిన టైమ్ లో నిర్మాత నాగవంశీ(naga vamsi) సైతం నానితో ఈ సినిమా గురించి డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే తాజా పరిణామాల్లో ఈ ప్రాజెక్ట్‌ను నాని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డెసిషన్ వెనుక అసలు కారణాలేంటన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, 96 ఫేమ్ ప్రేమ్ కుమార్(prem kumar) దర్శకత్వంలో ఓ ప్రేమకథా సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏషియన్ సునీల్(Asian suneel) నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం బ్లడీ రోమియో(Bloody romeo) సినిమా పనులతో బిజీగా ఉన్న నాని.. ఆ సినిమా పూర్తైన తర్వాత తన తర్వాతి సినిమాలపై దృష్టి పెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ(Siva nirvana)తో పాటు కోలీవుడ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితోనూ(Sibi chakravarth) నాని డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేయాలనే ఆలోచనతో నాని కథలను ఎంపిక చేసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుత ప్లానింగ్స్ ను బట్టి చూస్తే నాని రాబోయే రెండేళ్ల పాటు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండే అవకాశముంది. అయితే డిస్కషన్స్ లో ఉన్న సినిమాలు, వాటి నిర్మాణ షెడ్యూళ్లపై అఫషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉంది.








