India Tariffs: అమెరికాపై ‘సున్నా’ సుంకాలు.. భారత్‌పై మాత్రం 18 శాతం!
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ (Jamieson Greer) వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా నుండి దిగుమతి అయ్యే అధిక శాతం వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలను (India Tariffs) పూర్తిగా సున్నాకు తగ్గించేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు.
అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై మాత్రం అమెరికా 18 శాతం టారిఫ్‌ను (US Tariffs) కొనసాగించనుంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అసమతుల్యత (Trade Imbalance) కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రీర్ (Jamieson Greer) స్పష్టం చేశారు. కొన్ని కీలక రంగాల్లో భారత్ రక్షణ కొనసాగిస్తున్నప్పటికీ, చాలా ఉత్పత్తులపై సుంకాలు తొలగించడం అమెరికాకు దక్కిన భారీ విజయంగా ఆయన అభివర్ణించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గతంలో తక్కువ ధరకు లభిస్తుండటంతో రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేసిన భారత్, గత ఏడాది చివరి నుండి వాటిని క్రమంగా తగ్గించిందని గ్రీర్ (Jamieson Greer) తెలిపారు. అదే సమయంలో అమెరికా నుండి గ్యాస్, ప్రొపేన్ వంటి ఇంధన వనరుల దిగుమతులను పెంచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా ప్రమాణాలను (Non-tariff barriers) పాటించేందుకు భారత్ అంగీకరించడం వల్ల తమ ఉత్పత్తులకు ఇక్కడ మంచి మార్కెట్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






